Bombay High Court: రెండో భార్యకు ఆ హక్కులు ఉండవు.. సంచలన కామెంట్స్ చేసిన హైకోర్టు..

Bombay High Court: రెండవ భార్యకు పెన్షన్ లభించడంపై ముంబై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చట్ట బద్ధంగా వికాడకులు..

Bombay High Court: రెండో భార్యకు ఆ హక్కులు ఉండవు.. సంచలన కామెంట్స్ చేసిన హైకోర్టు..
Mumbai High Court
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 17, 2022 | 2:13 PM

Bombay High Court: రెండవ భార్యకు పెన్షన్ లభించడంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చట్ట బద్ధంగా వికాడకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే.. మొదటి భార్యకే ఆ పెన్షన్ లభిస్తుందని, రెండవ భార్యకు ఎలాంటి హక్కులూ ఉండబోవని స్పష్టం చేసింది బాంబై హైకోర్టు. మహారాష్ట్ర ప్రభుత్వం తనకు పెన్షన్‌ ఇవ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ సోలాపూర్‌కు చెందిన శామల్‌ తాటే దాఖలు చేసిన పిటిషన్ తోసిపుచ్చిన హైకోర్టు ధర్మాసనం.. ఈ వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకెళితే.. మహదేవ్ తాటే సోలాపూర్‌ కలెక్టరేట్‌లో ప్యూన్‌గా పనిచేసే వాడు. అతను తన మొదటి భార్యను వదిలేసి.. శామల్ తాటేని రెండవ పెళ్లి చేసుకున్నాడు. అయితే, మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. ఇలా కాలం గడిచిపోయింది. మహాదేవ్ 1996లో మృతి చెందాడు. అప్పడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. మొదటి భార్య చట్ట ప్రకారం ముందుకొచ్చింది. మహాదేవ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ తనకే దక్కుతాయంటూ మొదటి భార్య వచ్చింది.

దాంతో వివాదం పెద్దగా మారడంతో.. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌లో 90 శాతం మొదటి భార్య తీసుకొని నెలవారీ పింఛన్‌ రెండోభార్యకు ఇచ్చేలా వారి మధ్య అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారు. చట్ట ప్రకారం.. ఆ పెన్షన్ మహదేవ్ మొదటి భార్యకే వచ్చేది. అలా వచ్చిన డబ్బును రెండవ భార్య శామల్‌కి ఇచ్చేవారు. అయితే, మహదేవ్ మొదటి భార్య క్యాన్సర్‌తో చనిపోయింది. దాంతో వారికి వచ్చే పెన్షన్ నిలిచిపోయింది. అయితే, మహదేవ్ రెండో భార్య అయిన తనకు నెలవారీ పెన్షన్ చెల్లించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంది శామల్. ఆ అర్జీని ప్రభుత్వం తిరస్కరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. ప్రభుత్వ నిర్ణయం సరైనదేనంటూ శామల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

Also read:

India vs China: డ్రాగన్ కంట్రీ కాపీ క్యాట్.. అది కూడా మనదే.. 4 వేల ఏళ్ల క్రితమే కాజేసిందట..!

Kurnool News: కర్నూలు జిల్లాలో వరుస విషాద ఘటనలు.. వారి ఆవేదన అంతా ఇంతా కాదు..

KCR Birthday in Australia: ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం కేసీఆర్‌కు జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో విషెస్ చెప్పిన అభిమాని..