UP Elections 2022: యూపీ ఎన్నికల బరిలో నేర చరితులు.. కొందరిపై మర్డర్, రేప్ కేసులు కూడా..

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగియగా.. మూడో విడత పోలింగ్ ఈ నెల 20న జరగనుంది.

UP Elections 2022: యూపీ ఎన్నికల బరిలో నేర చరితులు.. కొందరిపై మర్డర్, రేప్ కేసులు కూడా..
Samajwadi Party
Follow us
Janardhan Veluru

|

Updated on: Feb 17, 2022 | 2:04 PM

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగియగా.. మూడో విడత పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. 59 నియోజకవర్గాలకు జరగనున్న మూడో దశ ఎన్నికల్లో మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. వీరిలో 22 శాతం మంది (135 మంది అభ్యర్థులు) నేర చరితులే కావడం విస్తుగొలిపే అంశం. అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ పోటాపోటీగా నేర చరితులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్(ADR), ఉత్తర ప్రదేశ్ ఎలక్షన్ వాచ్(Uttar Pradesh Election Watch) పరిశీలనలో తేలింది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్స్‌ను విశ్లేషించి ఈ నేర చరితుల చిట్టాను ఏడీఆర్ వెల్లడించింది. ఎన్నికల బరిలో నిలుస్తున్న మొత్తం 627 మంది అభ్యర్థుల్లో నలుగురు అభ్యర్థులు సరైన అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంతో వారి నేర చరిత వివరాలను మాత్రం ఏడీఆర్ నిర్ధారించలేదు.

అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav సారథ్యంలోని సమాజ్‌వాది పార్టీ(SP) తరఫున మూడో విడతలో 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 30 మంది..అంటే ఏకంగా 52 శాతం మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు(లేదా ఎదుర్కొన్నారు). స్వయంగా వీరు తమ నేర చరిత వివరాలను తమ అఫిడవిట్స్‌లో వెల్లడించారు.

అధికార భారతీయ జనతా పార్టీ(BJP) నుంచి మూడో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న 55 మంది అభ్యర్థుల్లో 25 మందిపై (46 శాతం) క్రిమినల్ కేసులున్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. అలాగే బహుజన్ సమాజ్‌ పార్టీ(BSP)కి చెందిన 59 మంది అభ్యర్థుల్లో 23 మంది (39 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన 36 శాతం మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) కూడా తక్కువేం తినలేదు. ఆ పార్టీ తరఫున బరిలో నిలుస్తున్న వారిలో 22 శాతం మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.

Up Elections

UP Assembly Elections

17 శాతం అభ్యర్థులపై తీవ్ర నేరాభియోగాలు…

623 మంది అభ్యర్థుల అఫిడవిట్స్‌ను పరిశీలించిన ఏడీఆర్.. వీరిలో 103 మంది (17 శాతం) అభ్యర్థులు తీవ్ర క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. ఐదేళ్ల జైలు శిక్ష కంటే ఎక్కువ శిక్షకు అవకాశమున్న కేసులు, నాన్-బెయిలబుల్ కేసులు, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులు, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన కేసులు, హత్య, రేప్, కిడ్నాప్, దాడి కేసులు, ప్రజా ప్రతినిధిత్వ చట్టం (సెక్షన్ 8) ఉల్లంఘన కేసులు, అవినీతి నిరోధక చట్టం కేసులు, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని తీవ్ర క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిగా పరిగణిస్తారు.

అభ్యర్థులపై మర్డర్, రేప్ కేసులు..

యూపీలో మూడో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 11 మంది అభ్యర్థులు.. తాము మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.. వీరిలో ఇద్దరు అభ్యర్థులు రేప్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అలాగే ఇద్దరు అభ్యర్థులు హత్య కేసులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

మూడో విడతలో 59 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుండగా.. వీటిలో 26 స్థానాలను రెడ్ అలెర్ట్ నియోజకవర్గాలు. ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థుల్లో ముగ్గురికి పైగా అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే.. ఆ నియోజకవర్గాన్ని రెడ్ అలెర్ట్ నియోజకవర్గంగా పరిగణిస్తారు. ఎన్నికల సందర్భంగా ఆ నియోజకవర్గాల్లో భద్రతపై పోలీసులు ఫోకస్ ఎక్కువగా ఉండేలా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఏడు విడతల్లో యూపీ ఎన్నికలు.. మొత్తం ఏడు విడతల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత పోలింగ్ ఫిబ్రవరి 20న నిర్వహించనుండగా.. ఫిబ్రవరి 23న నాలుగో విడత, ఫిబ్రవరి 27న ఐదో విడత, మార్చి 3న ఆరో విడత, మార్చి 7న ఏడో విడత(చివరి) పోలింగ్ నిర్వహించనున్నారు.

పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపున మార్చి 10న చేపట్టనున్నారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని కథనాలను ఇక్కడ చదవండి.. 

Also Read..

ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్స్ ధరలపై కమిటీ కీలక నిర్ణయం.. వారం రోజుల్లోనే ప్రభుత్వం నుంచి..

India vs China: డ్రాగన్ కంట్రీ కాపీ క్యాట్.. అది కూడా మనదే.. 4 వేల ఏళ్ల క్రితమే కాజేసిందట..!