India vs China: డ్రాగన్ కంట్రీ కాపీ క్యాట్.. అది కూడా మనదే.. 4 వేల ఏళ్ల క్రితమే కాజేసిందట..!
India vs China: చైనా విడుదల చేసిన ఒక పుస్తకం ఇప్పుడు ఇండియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అది మనదే అంటూ భారతీయ...
India vs China: చైనా విడుదల చేసిన ఒక పుస్తకం ఇప్పుడు ఇండియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అది మనదే అంటూ భారతీయ నిపుణులు అంటున్నారు. భారతీయ నిపుణులే కాదు.. చైనాకు చెందిన ప్రముఖులు అదే అంటున్నారు. 4 వేల ఏళ్ల క్రితమే దీనిని తస్కరించారని చెబుతున్నారు. మరి ఇంతకీ చైనా ఏం విడుదల చేసింది? మన దేశం నుంచి ఏం తస్కరించింది? అసలు చర్చ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 12 రాశులతో కూడిన కాల చక్రం పుస్తకాన్ని(జోడియాక్ క్యాలెండర్) చైనా గురువారం నాడు విడుదల చేసింది. కష్గర్ యూనివర్సిటీ అకాడమిక్ జర్నల్‌లో దీన్ని ప్రచురించారు. అయితే, ఇది వాస్తవానికి పురాతన బాబిలోనియా కాలానికి చెందినది జిన్ జియాంగ్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ భాషా పరిశోధనా సంస్థ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ లి షిన్‌హుయ్ పేర్కొన్నారు. ఈ బాబోలోనియా ఖగోళ జ్ఞానాన్ని భారత్ అందిపుచ్చుకుంది. తదనంతర కాలంలో అది 12 రాశి చక్రాలతో కూడిన కాలచక్రంగా రూపారూపుదిద్దుకుంది. ఇక క్రీస్తు పూర్వం 3వ శతాబద్దంలో దానిని భారత్ నుంచి చైనా స్వీకరించింది అని ఆయన పేర్కొన్నారు.
కాగా, కొరియాకు చెందిన సోషల్ మీడియా యూజర్ ‘‘ఈ కాలచక్రం చైనాది మాత్రమే కాదు.. దక్షిణ కొరియాకు సంబంధించినది కూడా’’ అని పేర్కొన్నారు. ‘‘మన దేశం కూడా వ్యవసాయ ఆధారిత దేశమే. ఈ వ్యవస్థ జోసోన్ శకం(1392-1910)లో మన దేశంలోకి ప్రవేశపెట్టబడింది. సివిల్ సర్వెంట్ ఎగ్జామ్స్‌లోనూ దీని గురించి ప్రస్తావించారు. ఇది చైనా, జపాన్, దక్షిణ కొరియాతో సహా తూర్పు ఆసియా దేశాల సాంస్కృతిక వారసత్వం మాత్రమే’’ అనే పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఒక చైనీస్ నెటిజన్..“ఈ వ్యవస్థ చైనాలోని వాతావరణ మార్పుల ఆధారంగా రూపొందించబడింది. వాతావరణ మార్పు అనేది అక్కడి భౌగోళిక వాతావరణానికి సంబంధించినది. చైనా పెద్ద దేశం. కొరియా చాలా చిన్నది. రెండు దేశాల వాతావరణ లక్షణాలు ఒకేలా ఉంటాయా? మీ వాదన సరైనది కాదు.’’ అని కౌంటర్ ఇచ్చారు.
ఇలా చైనా, కొరియన్ నెటిజన్ల మధ్య ఆదిపత్య పోరు సాగుతుండగా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కొరియన్ వంటకాలు, కిమ్చి, క్యాబేజీ వంటి అంశాలను ప్రస్తావిస్తూ సదరు నెటిజన్లు పరస్పరం కామెంట్ల యుద్ధం చేసుకున్నారు. అయితే, ఇదంతా పక్కన పెట్టండి.. ఇది అసలు మన దేశానికి సంబంధించినది కాదంటూ యూనివర్సిటీ ప్రొఫెసర్ బాంబ్ పేల్చారు. ఈ జోడియాక్ క్యాలేండర్ బాబిలోనియా సంస్కృతి నుంచి ఉద్భవించింది. భారతదేశంలో కాలచక్రంగా రూపాంతంర చేందగా.. దానిని చైనా అందిపుచ్చుకుంది అని ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఫ్రొఫెసర్ లి షిన్‌హుయ్. దీన్ని బేస్ చేసుకుని.. మన సంస్కృతిలో భాగమైన పంచాంగం(జొడియాక్ క్యాలెండర్)ను చైనా అప్పట్లోనే దొంగిలించిందంటూ ఇండియన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మందికి చెందినన్నవీ మనవే అంటూ తన వక్రబుద్ధిని పదే పదే ప్రదర్శిస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
Also read:
Kurnool Check Post: అవన్నీ లగేజీ బ్యాగులు అనుకున్నారు.. ఓపెన్ చేసి చూస్తే కళ్లు చెదిరిపోయాయి..
AP Gold Loans: గోల్డ్ లోన్ తీసుకునే రాష్ట్రాలో టాప్‌లో ఏపీ.. షాకింగ్ విషయాలు మీకోసం..