Taslima Nasreen: స్త్రీ ద్వేషులు ఆ పద్ధతిని పరిచయం చేశారు.. హిజాబ్‌పై బంగ్లాదేశ్ రచయిత్రి సంచలన వ్యాఖ్యలు..
హిజాబ్ వివాదంపై వివాదాస్పద సంచనల వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్. హిజాబ్, బుర్ఖా లేదా నిఖాబ్ మహిళల అణచివేతకు గుర్తులని అభిప్రయా పడ్డారు. కర్ణాటక రాష్ట్రంలో వివాదంగా మారిన హిజాబ్ వ్యవహరం..
హిజాబ్ వివాదంపై వివాదాస్పద సంచనల వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్. హిజాబ్, బుర్ఖా లేదా నిఖాబ్ మహిళల అణచివేతకు గుర్తులని అభిప్రయా పడ్డారు. కర్ణాటక రాష్ట్రంలో వివాదంగా మారిన హిజాబ్ వ్యవహరంపై తస్లీమా నస్రీన్ తనదైన తరహాలో స్పందించారు. మత హక్కు , విద్యా హక్కుకు అతీతం కాదని కూడా ఆమె తెలిపారు. బుర్ఖాను చీకటి యుగపు పవిత్ర బెల్ట్‌తో ఆమె పోల్చారు. మహిళా అంశాలపై ఆమె తరచూ వివాదాలకు దారితీసే ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. బుర్ఖా, హిజాబ్ ఎప్పటికీ స్త్రీ ఎంపిక కాదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో యూనిఫాం డ్రెస్ కోడ్ ప్రతిపాదన గురించి తస్లీమా నస్రీన్ తన అభిప్రయాలను వ్యక్తం చేశారు. విద్యా హక్కు మతానికి సంబంధం లేదని అన్నారు.
‘‘హిజాబ్‌ను 7వ శతాబ్దంలో కొంతమంది స్త్రీద్వేషులు పరిచయం చేశారు, ఎందుకంటే ఆ సమయంలో స్త్రీలను లైంగిక వస్తువులుగా పరిగణించేవారు. పురుషులు స్త్రీలను చూస్తే, పురుషులకు లైంగిక కోరిక కలుగుతుందని వారు నమ్మకం. కాబట్టి మహిళలు హిజాబ్ లేదా బురఖా ధరించాలి. వారు పురుషుల నుంచి తమను తాము దాచుకోవాలి” అని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా తన ట్విట్టర్ వేదికగా అభిప్రాయాపడ్డారు.
నేటి ఆధునిక సమాజంలో స్త్రీలు పురుషులతో సమానమని అన్నారు. కాబట్టి హిజాబ్ లేదా నిఖాబ్ లేదా బురఖా అణచివేతకు చిహ్నాలని తస్లీమా తప్పుపట్టారు. మతం కంటే విద్యే ముఖ్యమని లౌకిక సమాజంలో సెక్యులర్ డ్రెస్ కోడ్, కామన్ సివిల్ కోడ్ తప్పనిసరి అని మరో లేవనెత్తారు. ఒక వ్యక్తి గుర్తింపు వారి మతపరమైన గుర్తింపుగా ఉండకూడదని తస్లీమా నస్రీన్ వివరించారు.
ఇవి కూడా చదవండి: Medaram Jathara 2022: మహా జన జాతరలో సందడిగా తొలి ఘట్టం.. ఇవాళ సమ్మక్క ఆగమనం
CM KCR Birthday: 68వ వసంతంలోకి సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జన్మదిన వేడుకలు..