viral News: వెరైటీ చోరీ.. ఏం దొంగిలించాడో తెలిస్తే షాక్ అవుతారు

దొంగలు సాధారణంగా డబ్బు, నగలు, విలువైన వస్తువులను చోరీ చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో తమకు అవసరమైన వస్తువును దొంగిలిస్తారు. కానీ హర్యాణా (Haryana) లోని రోహ్ తక్ లో...

viral News: వెరైటీ చోరీ.. ఏం దొంగిలించాడో తెలిస్తే షాక్ అవుతారు
Petrol Thief
Follow us

|

Updated on: Feb 17, 2022 | 5:15 PM

దొంగలు సాధారణంగా డబ్బు, నగలు, విలువైన వస్తువులను చోరీ చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో తమకు అవసరమైన వస్తువును దొంగిలిస్తారు. కానీ హర్యాణా (Haryana) లోని రోహ్ తక్ లో జరిగిన ఓ విచిత్ర దొంగతనం(Theft) ఆందోళన కలిగించడంతో పాటు నవ్వులు పూయిస్తోంది. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించేందుకు అలవాటు పడ్డ ఓ వ్యక్తి.. పెట్రోల్(Petrol) దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. పెట్రోల్ రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇంధనాన్ని చోరీ చేయడం గమనార్హం. ఇలా ఆరు రోజుల్లో లక్ష రూపాయల విలువైన పెట్రోల్ ను దొంగతనం చేశాడు. చివరికి బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

హర్యానాలోని రోహ్‌తక్‌ ప్రాంతానికి చెందిన అషుల్.. కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆదాయం సరిపోకపోవడంతో అక్రమ మార్గంలో సంపాదించేందుకు పెట్రోల్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. పెట్రోల్ బంక్‌కు వెళ్లి కారు ట్యాంక్ ఫుల్ చేయిస్తాడు. కారులో ఉన్న క్యాన్ల నిండా పెట్రోల్ కొట్టిస్తాడు. అనంతరం డబ్బులు తెస్తానని చెప్పి అక్కడి నుంచి ఉడాయిస్తాడు. ఇలా అతను గత ఆరు రోజుల్లో ఆరు పెట్రోల్ బంక్‌ల నుంచి రూ. లక్షకు పైగా విలువైన పెట్రోల్ దొంగిలించాడు. ఈ ఘటనపై పెట్రోల్ బంక్ యాజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి జింద్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్‌కు అషుల్ వెళ్లాడు. అక్కడ రూ.29 వేలు పెట్రోల్ కొట్టించుకుని పరారయ్యాడు. పెట్రోల్ దొంగతనం గురించి అప్పటికే సమాచారం తెలుసుకున్న బంక్ యజమాని.. అషుల్ ను అనుసరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పెట్రోల్ దొంగను పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

Also Read

చిచ్చు రేపిన అనారోగ్యం.. కుమారుడి వైద్య ఖర్చులు భరించలేక.. తండ్రి కఠిన నిర్ణయం

Hijab in AP: ఏపీని తాకిన హిజాబ్ వివాదం.. విద్యార్థినులను అనుమతించని కళాశాల యాజమాన్యం

Pakistan PM Imran Khan: పాకిస్తాన్‌‌లో మొదలైన రాజకీయ రచ్చ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మెడకు బిగుస్తున్న ద్రవ్యోల్బణం ఉచ్చు..