Asaduddin: హిందూవులతో ముస్లిం యువతులు తిరిగితే.. దాడులు చేయడానికి మీరెవరు?: అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన సైనికులను పాకిస్తాన్‌ చంపుతుంటే.. పాక్‌తో ప్రధాని మోదీ క్రికెట్

Asaduddin: హిందూవులతో ముస్లిం యువతులు తిరిగితే.. దాడులు చేయడానికి మీరెవరు?: అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
Asad

MIM chief and hyderabad MP Asaduddin‌ Owaisi hot comments: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన సైనికులను పాకిస్తాన్‌ చంపుతుంటే.. పాక్‌తో ప్రధాని మోదీ క్రికెట్ ఆడేందుకు సిద్ధపడ్డారని ఆయన విమర్శించారు. హిందూవులతో ముస్లిం యువతులు తిరిగితే.. దాడులు చేయడానికి మీరెవరని నిలదీసిన అసదుద్దీన్‌.. “ముస్లిం యువతి, హిందూ యువకులపై దాడిచేసి.. సోషల్‌ మీడియాలో అవమానరపర్చడం దారుణం. హిందూ యువతులు, ముస్లిం యువకులతో తిరిగితే.. సంతోషపడుతున్నారు.. అది చాలా పెద్ద తప్పు. మన కుటుంబాల్లో మార్పు రావాలి. యూపీలో యోగిని ఓడించి తీరుతాం” అని అసదుద్దీన్‌ అన్నారు.

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరిగిపోయాయని విమర్శించిన అసద్.. చైనాపై మాట్లాడేందుకు మోదీ భయపడుతున్నారు.. చైనా చొరబడితే ఎందుకు మౌనంగా ఉన్నారని మోదీ సర్కారుని ప్రశ్నించారు. ముస్లిమ్ అమ్మాయిలు హిందూ అబ్బాయిలతో తిరిగినా వాళ్ల సావు ఏదో వాళ్లు చేస్తారు మీరు దాడులు చేయడానికి మధ్యలో మీరెవరు? అని ప్రశ్నించిన అసదుద్దీన్.. ముస్లిం యువకులు చేస్తున్న దాడులు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముస్లిం యువతి, హిందూ యువకులపై దాడులు చేసి సోషల్ మీడియాలో అవమానపరచడం దారుణం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.

“హత్యలకు పాల్పడుతున్న నేరస్థులును సమాజం నుంచి బహిష్కరించాలి. ఉత్తరప్రదేశ్లో సీఎం యోగిని ఓడించి తీరుతాం. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి పీఎం దాని గురించి మాట్లాడారు. చైనా భారత భూభాగంలోకి చూడబడింది చైనా గురించి పీఎం మాట్లాడడానికి భయపడతారు. పుల్వామా ఘటనకి ప్రతీకారం తీర్చుకున్నారు. చైనా చొరబడితే ఎందుకు మౌనంగా ఉన్నారు? కశ్మీర్లో ఇంటలిజెన్స్ బ్యూరో అమిత్ షా ఏం చేస్తున్నారు? పాకిస్థాన్ నుంచి ఆయుధాలు వస్తున్నాయి. ఉగ్రవాదులు చొరబడ్డారు. మీరు ఎలాంటి సీజ్ ఫైర్ అక్కడ చేస్తున్నారు?” అంటూ కేంద్రంపై ప్రశ్నలు కురిపించారు అసద్.

(నూర్ మహమ్మద్, టీవి9)

Read also: Andhra Pradesh, Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..

Click on your DTH Provider to Add TV9 Telugu