AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh, Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..

ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎస్ సమీర్ శర్మ. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించాలని స్పష్టం చేశారు.

Andhra Pradesh, Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..
Top 9
Venkata Narayana
|

Updated on: Oct 19, 2021 | 7:47 AM

Share

1. ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎస్ సమీర్ శర్మ. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ధాన్యం సేకరణ మరింత సులువుగా జరిగేలా చూడాలని ఆదేశించారు AP CS.

2. జగనన్న తోడు కార్యక్రమం వాయిదా పడింది. మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సెలవు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 11 గంటలకు జగనన్న తోడు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపింది ఏపీ ప్రభుత్వం.

3. మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు ఇంటివద్ద హైడ్రామా నెలకొంది. నర్సీపట్నం పోలీసులు ఆయనకు నోటీసు ఇవ్వడానికి వచ్చారు. గంజాయి ఎగుమతులపై మీడియాలో ఏ ఆధారాలతో మాట్లాడారో చెప్పాలన్నారు పోలీసులు.

4. సచివాలయ ఉద్యోగుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి. డ్యూటీ టైం అయిపోకముందే సచివాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు సిబ్బంది. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే.

5. హూజురాబాద్‌లో ఈటల రాజేందర్ దిష్టి బొమ్మను దహనం చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. బీజేపీ నేతల ఫిర్యాదుతోనే దళితబంధు పథకం ఆగిపోయిందని ఆరోపించారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని నినాదాలు చేశారు టీఆర్‌ఎస్‌ శ్రేణులు.

6. నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశమయ్యారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. 25న జరిగే పార్టీ ప్లీనరీ గురించి చర్చించారు. నవంబర్ 15న జరగనున్న దశాబ్ది ఉత్సవాలపై నాయకులతో మాట్లాడారు కేటీఆర్.

7. మళ్లీ నోరుజారారు స్టేషన్ ఘన్‌పూర్ MLA తాటికొండ రాజయ్య. ఈ పిల్లలు నీవల్లే పుట్టారని తనను అభినందిస్తున్నారని బహిరంగ సభలో కామెంట్‌ చేశారు. ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం ప్రొగ్రాంలో టంగ్ స్లిప్‌ అయ్యారు ఎమ్మెల్యే.

8. మహారాష్ట్రకు రహస్యంగా ఇనుము, రాగి తరలిస్తున్న లారీలను పట్టుకున్నారు టాస్క్ పోర్స్ పోలీసులు. 20 లక్షల విలువైన 50 టన్నుల తుక్కు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. లారీలు సీజ్‌ చేసి నలుగురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.

9. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్ పరీక్షల హాల్ టికెట్లు ఇవాళ్టి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు అధికారులు. సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. హాల్‌టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చేసింది బోర్డు.

Read also: Petrol Price: పెట్రోల్ ధరలను కంట్రోల్ చేసే పనిలో కేంద్రం.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు షురూ.?