Petrol Price: పెట్రోల్ ధరలను కంట్రోల్ చేసే పనిలో కేంద్రం.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు షురూ.?

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం చుక్కలనంటుతోన్న పెట్రోల్ ధరలను కంట్రోల్ చేసే పనిలో పడిందా? ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిందా?

Petrol Price: పెట్రోల్ ధరలను కంట్రోల్ చేసే పనిలో కేంద్రం.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు షురూ.?
Modi Petro Price
Follow us

|

Updated on: Oct 19, 2021 | 7:13 AM

Narendra Modi – Petrol Price: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం చుక్కలనంటుతోన్న పెట్రోల్ ధరలను కంట్రోల్ చేసే పనిలో పడిందా? ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అసలు పెట్రోల్ ధరలు తగ్గేనా? అనే ఆలోచనల్లోకి వెళితే, పెరగడమే కాని తగ్గడం లేదు అన్నట్లుగా ఉంది పెట్రోల్, డీజిల్ ధరల రేట్లు చూస్తే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రం చమురు ధరల సవాల్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తున్నది.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు కేంద్రప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పెట్రోల్ ధరలు తగ్గించడానికి ఆర్థిక శాఖతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చమురు ధరలు తగ్గించాలని భావిస్తున్న పెట్రోలియం శాఖ ఇందుకోసం ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం. చమురు ధరలపై విధిస్తున్న అధిక పన్నులపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్త్తోంది. ట్యాక్స్ విషయంలో ప్రజలపై భారం తగ్గించేలా నిర్ణయం ఉండాలని భావిస్తోందట. ఎల్పీజీ సబ్సిడీనీ కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని యోచిస్తున్నట్టు తెలిస్తోంది. అవసరమైన వారికి మాత్రమే ఎల్పీజీ సబ్సిడీ అందించాలని భావిస్తున్నట్టు సమాచారం.

చమురు ధరలు తగ్గించాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. ఇందుకోసం కంపెనీలతోనూ చర్చిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. సౌదీ అరేబియా మొదలు రష్యా వరకు కేంద్రం చమురు కంపెనీలతో చర్చించి ధరలు తగ్గించే అవకాశాలను పరిశీలిస్తుందట. వచ్చే మూడు నెలల వరకు బ్యారెల్ చమురు ధర 70 అమెరికన్ డాలర్లు ఉండాలని, అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి దేశంలో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా Petrol, Diesel ధరలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ Rates సెంచరీ దాటాయి. డీజిల్ కూడా సెంచరీకి చేరువలో ఉంది. దీంతో సామాన్య జనానికి తోడుగా ప్రతిపక్షాలు Fuel ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Read also:Cow protection: గోవులను సంరక్షించి తనకున్న భక్తి.. ప్రేమను చాటుతున్న చాంద్ భాషా, పవన్ కళ్యాణ్ ప్రశంసలు