AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మనుషుల్ని బతకనిచ్చేలా లేరు.. అధికారులే కళ్లు తేలేశారు..

ఫుడ్‌ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలతో హడలెత్తిస్తున్నా కల్తీగాళ్ల వక్రబుద్ది మారట్లేదు. అధిక లాభాల కోసం జనాల ప్రాణాలతో చెలగామం ఆడుతూనే ఉన్నారు. హైదరాబాద్‌లో మరోసారి నిత్యావసరాల కల్తీ వెలుగుచూసింది. 20 రకాల వస్తువులను అధికారులు సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: మనుషుల్ని బతకనిచ్చేలా లేరు.. అధికారులే కళ్లు తేలేశారు..
Adulterated Goods
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Mar 12, 2025 | 3:03 PM

Share

ఎక్కడ చూసినా కల్తీ.. ఏది తిన్నా విషం అన్నట్లుగా మారిపోయింది ప్రస్తుతం మన పరిస్థితి. నిత్య జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువు కలుషితం అయిపోతుంటే.. డబ్బులు వెచ్చించి మరీ కొనుగోలు చేసి మోసపోవడం సామాన్య జనాల వంతుగా మారింది. కల్తీ అని ఏ మాత్రం అనుమానం రాకుండా ఒరిజినల్ బ్రాండెడ్ వస్తువులుగా ప్యాకింగ్ చేయడం.. అది నిజం అని ప్రజలు డబ్బులు పెట్టి మరీ కొనుగోలు చేసి వాడడం, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవడం ఇప్పుడు అంతటా జరుగుతోంది. ఇదే క్రమంలో తాజాగా కాటేదాన్‌లో భారీగా కల్తీ నిత్యావసర సరుకుల గుట్టు బయటికి వచ్చింది.

హైదరాబాద్ నగరం కాటేదాన్‌లో భారీగా కల్తీ వస్తువులు పట్టుబడ్డాయి. 20 రకాల కిరాణా వస్తువులు సీజ్ చేసిన‌ రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం సీజ్ చేసింది. ఈ చర్యకు పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ వస్తువులనే ఒరిజినల్ అన్నట్లుగా ప్యాకింగ్ చేసి మార్కెట్లలో విక్రయిస్తున్నారు ఇందుకు సంబంధించిన ఓ ముఠా. ప్రజలకు, దుకాణదారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా ఒరిజినల్ ప్రొడక్ట్స్ లాగా ప్యాకింగ్ చేసి బయటికి వదులుతున్నారు కంత్రీగాళ్లు. తద్వారా లక్షల్లో సంపాదిస్తూ పబ్బం గడుపుతున్నారు. ఈ విషయమై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం.. కల్తీ వస్తుల తయారీ కేంద్రంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించింది. ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి మనం నిత్య జీవితంలో సాధారణంగా ఉపయోగించే వివిధ రకాలైన కిరాణా వస్తువులను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎస్ఓటీ బృందం సీజ్ చేసిన కల్తీ వస్తువుల వివరాలు:

  1. బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ టీ పౌడర్
  2. బ్రూక్ బాండ్ తాజ్‌మహల్‌ టీ పౌడర్
  3.  వీల్ సర్ఫ్
  4. ప్యార్ షూట్ కొబ్బరి నూనె
  5.  కంఫర్ట్ కండీషనర్
  6.  క్లినిక్ ప్లేస్ హెయిర్ షాంపో
  7. కార్న్ పౌడర్
  8.  పాండ్స్ బాడీ లోషన్‌తో పాటు ఇతర వస్తువులు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..