జనసేనాని కళ్లు తెరిచాడు

తెలంగాణ ఇంటర్ బోర్డు అవకతవకల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖను సంధించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు. బోర్డు వ్యవహరించిన తీరుతో విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాలు వెల్లడించాక 17మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:52 pm, Wed, 24 April 19
జనసేనాని కళ్లు తెరిచాడు

తెలంగాణ ఇంటర్ బోర్డు అవకతవకల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖను సంధించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు. బోర్డు వ్యవహరించిన తీరుతో విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాలు వెల్లడించాక 17మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యూయేషన్, ఫలితాల వెల్లడి.. ఇలా విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనేక సందేహాలున్నాయని.. వాటిని నివృత్తి చేసి నిజాలను వెల్లడించాలని అన్నారు. ఇందుకు బదులు.. వారి తల్లిదండ్రుల పైనే బోర్డు అధికారులు ఎదురుదాడికి దిగడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థులకు పరిహారం చెల్లించాలని లేఖలో ప్రస్తావించారు. జీవితం చాలా విలువైనది అని..నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని విద్యార్థులకు హితవు పలికారు.