పోలీసుల అదుపులో పిల్లల కిడ్నాపర్లు..

చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే అంతర్ రాష్ట్ర ముఠాను హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్‌కు గురైన ముగ్గురు పిల్లలను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. కిడ్నాపర్స్ నుంచి 35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ ఈ ముఠా చిన్నపిల్లలను అపహరించి.. పిల్లలు లేని వారికి లక్షల రూపాయలకు విక్రయించడమే టార్గెట్‌గా పెట్టుకుంది. తొమ్మిది మందితో కలిసి ఏర్పడిన ఈ ముఠా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా […]

పోలీసుల అదుపులో పిల్లల కిడ్నాపర్లు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 25, 2019 | 12:02 PM

చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే అంతర్ రాష్ట్ర ముఠాను హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్‌కు గురైన ముగ్గురు పిల్లలను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. కిడ్నాపర్స్ నుంచి 35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ ఈ ముఠా చిన్నపిల్లలను అపహరించి.. పిల్లలు లేని వారికి లక్షల రూపాయలకు విక్రయించడమే టార్గెట్‌గా పెట్టుకుంది. తొమ్మిది మందితో కలిసి ఏర్పడిన ఈ ముఠా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా కనిపించే పిల్లలను ఎత్తుకుపోయేదని పోలీసులు తెలిపారు.

గత నెల 23వ తేదీన బండ్లగూడ కుబా కాలనీకి చెందిన రెండున్నరేళ్ల షేక్ సోఫియాన్ ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండాపోయాడు. దీంతో అతని తండ్రి షేక్ ఫజల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికంగా బుర్ఖా ధరించిన ఓ మహిళ బాబును ఎత్తుకెళ్లడాన్ని గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ మహిళ వెనుక ఉన్న ముఠాను గుర్తించి, దర్యాప్తు ప్రారంభించారు.