AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై హైకోర్టు సీరియస్..

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ పరీక్ష ఫలితాల వివాదంపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనికి ఎంత సమయం పడుతుందని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ని ప్రశ్నించింది. సుమారు 2 నెలలు పడుతుందన్న ఆయన వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెయిలైన 3లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనానికి అంత సమయం ఎందుకని ప్రశ్నించింది. ఈ విషయంలో […]

ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై హైకోర్టు సీరియస్..
Ram Naramaneni
|

Updated on: Apr 23, 2019 | 6:33 PM

Share

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ పరీక్ష ఫలితాల వివాదంపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనికి ఎంత సమయం పడుతుందని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ని ప్రశ్నించింది. సుమారు 2 నెలలు పడుతుందన్న ఆయన వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెయిలైన 3లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనానికి అంత సమయం ఎందుకని ప్రశ్నించింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సోమవారం చెబుతామని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఫలితాల్లో గందరగోళంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంటూ జీవోను ఆయన సమర్పించారు. ఏజెన్సీ పనితీరుపై మాత్రమే విచారణకు ఆదేశించారని అభిప్రాయపడిన హైకోర్టు.. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు దీనిపై న్యాయవిచారణకు ఆదేశించాలంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది దామోదర్‌ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని కోరగా.. న్యాయవిచారణతో విద్యార్థులకు ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. దీనిపై సోమవారంలోపు అభిప్రాయాన్ని చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Follow Us
మీరు గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి
మీరు గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి
భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందాలు.. పూర్తి వివరాలు ఇవే!
భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందాలు.. పూర్తి వివరాలు ఇవే!
కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. ఈ లిరిక్స్ ఏ పాటలో గుర్తు
కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. ఈ లిరిక్స్ ఏ పాటలో గుర్తు
షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలా
షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలా
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
పిల్లలకు ఎక్కువగా సాల్ట్, స్వీట్ తినిపిస్తున్నారా..? ఇది తెలిస్తే
పిల్లలకు ఎక్కువగా సాల్ట్, స్వీట్ తినిపిస్తున్నారా..? ఇది తెలిస్తే
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
బంగారం Vs బ్యాంక్ FD: సామాన్యులకు ఏది బెస్ట్.? డబ్బు డబుల్ చేసే..
బంగారం Vs బ్యాంక్ FD: సామాన్యులకు ఏది బెస్ట్.? డబ్బు డబుల్ చేసే..
రోజూ ఆపిల్ ఇలా వాడండి .. చర్మం ముత్యంలా మెరిసిపోతుంది!
రోజూ ఆపిల్ ఇలా వాడండి .. చర్మం ముత్యంలా మెరిసిపోతుంది!