2026 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఏకైక హీరోయిన్.. అమ్మడి జోరు తగ్గేదే లే
Rajitha Chanti
Pic credit - Instagram
05 November 2026
సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో నిలిచిన ఏకైక హీరోయిన్ మమితా బైజు.
'ప్రేమలు' సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన మమితా, ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా మారింది.
ముఖ్యంగా 2026వ సంవత్సరం ఆమె కెరీర్‌లోనే గోల్డెన్ ఇయర్‌గా నిలిచింది. ఈ ఏడాదిలో మమితా నటించిన సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి.
వరుసగా ఆమె నటించిన చిత్రాలు వందల కోట్లు వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతుంది.
'జన నాయగన్', 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' వంటి చిత్రాలతో ఆమె ఈ ఏడాదిలోనే బాక్సాఫీస్‌ను షేక్ చేశారు.
ఈ సినిమాలు సుమారు రూ. 300 కోట్ల నుంచి రూ. 350 కోట్ల వరకు భారీ కలెక్షన్లను సాధించి, మమితా బాక్సాఫీస్ క్వీన్ అనే ట్యాగ్ అందుకుంది.
కేవలం కమర్షియల్ సక్సెస్‌లే కాకుండా, విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్