Pawan Kalyan : సికింద్రాబాద్ ఘటన పై స్పందించిన జనసేనాని.. దురదృష్టకరం అంటూ..
Agnipath Scheme Protest: సికింద్రాబాద్(Secunderabad) రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. అగ్నిపథ్(Agnipath) కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ పాలసీకి వ్యతిరేకంగా ఆందోళనలు తారాస్థాయికి చేరాయి.

సికింద్రాబాద్(Secunderabad) రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. అగ్నిపథ్(Agnipath) కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ పాలసీకి వ్యతిరేకంగా ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. నిరసనకారులు భారీ ఎత్తున రోడ్లమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టిస్తున్నారు. రైల్వేబోగీలు, రైలు పట్టాలు, స్టేషన్ లోని ఫర్నీచర్స్‌ను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడీ ఆందోళనలు తెలుగు రాష్ట్రాలకు కూడా తాకాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా మెట్రో రైళ్లు, ఎంఎంటీస్ సర్వీసులతో పాటు సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా వెళ్లే అన్ని రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. ఇక ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రైల్వే పోలీసులు హెచ్చరించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో కొందర్ని అదుపులోకి తీసుకున్నారు.
దీంతో కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్ల రువ్వడంతో.. వారు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. గాయపడ్డవారిని పలువురిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను రిలీజ్ చేశారు. ఈ రోజు సికింద్రాబాద్ రేల్వేస్టేషన్ లో చోటు చేసుకున్న ఘటన దురదృష్టకరమైనవి. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్ మెంట్ విధానం పై చేపట్టిన ఈ నిరసనల నేపథ్యంలో జరిగిన ఈ సంఘటనలు ఆవేదన కలిగించాయి. పోలీసు కాల్పుల్లో మూర్తి చెందిన యువకుడి కుటుంబానికి నా ప్రగాఢ సన్నిభుతి తెలియచేస్తున్నాను., గాయపడిన వారు త్వరగా కోలుకొనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంటూ పవన్ లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి




