Hyderabad: హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మంత్రి కేటీఆర్ గూడ్ న్యూస్.. పూర్తి వివరాలు..
జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ శాసన మండలి వర్షాకాల సమావేశంలో పాల్గొన్న ఆయన...
జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ శాసన మండలి వర్షాకాల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రతి పక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇటీవల ముంపునకు గురైన ప్రాంతాలను గుర్తిస్తూ… సమగ్ర విచారణ చేపట్టి… నాలా గ్రిడ్ మెరుగుదల కోసం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ప్రధాన కాలువలను 173 కిలోమీటర్లుగా మదింపు చేసి మొదటి దశ కింద జాబితాను ఖరారు చేశామన్నారు. జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించి.. కిర్లోస్కర్, వోయన్ట్స్ నివేదికలను పరిగణలోకి తీసుకుంటూ… ఎస్ఈపీఈ ఇన్ఫ్రా కన్సల్టెన్సీని సంప్రదించి.. జీహెచ్ఎంసీ జాబితాకి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. భవిష్యత్ అవసరాలతోపాటు నగరం విస్తరణను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మక నాలా అభివృద్ధిని చేపట్టామని పేర్కొన్నారు. నగరు శివారు ప్రాంతాల్లో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కేటీఆర్ తెలిపారు.
నగర శివారులో మంచినీటి సమస్యను ఎలా తీర్చామో… అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఎక్కడైనా వరద సమస్య తీవ్రంగా ఉంటే జోనల్ కమిషనర్లకు ఇప్పటికే ఆదేశాలిచ్చామని… వాళ్లకు రెండు కోట్లు వరకు డబ్బులు విడుదల చేసే అధికారం ఇచ్చామని తెలిపారు. ఆ డబ్బుతో అప్పటికప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుపై కొవిడ్ ప్రభావం పడిందా అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
కొవిడ్ సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ మిథ్యగా మారిందని… కేంద్రం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పరిశ్రమల శాఖ తీసుకున్న పురోగమన విధానాల వల్ల పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. కొవిడ్ సమయంలో కొత్త పెట్టుబడుల వృద్ధిలో ఎలాంటి తగ్గుదల లేదన చెప్పారు.
Read Also.. Dussehra Holidays: దసరా పండుగ సెలవులను ప్రకటించిన తెలంగాణ సర్కార్.. ఎప్పటి నుంచంటే..