Hyderabad: గత నెల 25న నాలాలో గల్లంతైన వ్యక్తి.. 11 రోజుల తర్వాత దొరికిన మృతదేహం..
గత నెల 25న మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నాలాలో గల్లంతైన మోహన్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. అప్పట్నుంచి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా... 11 రోజుల తర్వాత ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలలో మృతదేహం దొరికింది...
గత నెల 25న మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నాలాలో గల్లంతైన మోహన్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. అప్పట్నుంచి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా… 11 రోజుల తర్వాత ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలలో మృతదేహం దొరికింది. మట్టిలో మృతదేహం కూరుకుపోయి ఉందని పోలీసులు వెల్లడించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
గణేశ్ టవర్స్‌లో నివాసముండే మెహన్‌రెడ్డి… గత నెల 25న స్నేహితలతో కలిసి వైన్స్ వద్ద మద్యం సేవించారు. అనంతరం ఇంటికి బయల్దేరారు. భారీ వర్షం రావడంతో రోడ్డు పక్కన ఆగారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న నాలాలో పడిపోయి గల్లంతయ్యాడు. రెండు రోజుల తర్వాత ఆయన నాలాలో పడినట్లు సీసీ ఫుటెజ్ ద్వారా గుర్తించారు. అప్పటి నుంచి జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా… ఈ రోజు ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలాలో కుళ్లినస్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహం నాలాలోని మట్టిలో కూరుకుపోయి ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులను పిలిచగా అది మోహన్ రెడ్డి శవంగా నిర్ధరించారు.
అదే రోజు హైదరాబాద్ మణికొండలో గోపిశెట్టి రజినీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా డ్రైనేజీలో పడి గల్లంతయ్యాడు. అతడి మృతదేహం రెండు రోజుల తర్వాత నెక్నాంపూర్ చెరువులో లభించింది. అయితే అదే మోహన్ రెడ్డి నాలాలో పడ్డారు. కానీ ఎవరు గుర్తించలేదు. వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. సీసీ ఫుటెజ్ పరిశీలిస్తే అతడు నాలాల పడినట్లు గుర్తించారు. అప్పటి నుంచి గాలిస్తుండగా ఇవాళ మృతదేహం లభ్యమైంది.
Read Also.. Crime News : సిగరెట్‌కు డబ్బులు అడిగినందుకు మహిళ గొంతు కోసి చంపేశాడు.. ఎక్కడంటే..