Different Thieve: ఆతనొక సరదా దొంగ.. తాను దోచిన సొత్తునంతా ఏం చేస్తాడో తెలుసా..?

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Oct 05, 2021 | 2:25 PM

Different Thieve: అతనో సరదా దొంగ.. తాను దోచిన సొత్తును కేవలం జల్సాలకే ఖర్చు చేసే నికార్సైన దొంగ. అందులోనూ నగదును మాత్రమే దోచుకునే..

Different Thieve: ఆతనొక సరదా దొంగ.. తాను దోచిన సొత్తునంతా ఏం చేస్తాడో తెలుసా..?
Thieve

Follow us on

Different Thieve: అతనో సరదా దొంగ.. తాను దోచిన సొత్తును కేవలం జల్సాలకే ఖర్చు చేసే నికార్సైన దొంగ. అందులోనూ నగదును మాత్రమే దోచుకునే సెలక్టీవ్ దొంగ. ఎన్నిసార్లు అరెస్టైనా.. తాను మాత్రం మారనంటాడు. దోపిడీల లెక్క చూస్తే తిక్క లేవాల్సిందే. అతను కాజేసి సొత్తు ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. అతని దోపిడీ విధానాలు, చర్యలను గమనించిన పోలీసులు.. ఆ దొంగకు క్రౌబర్ మ్యాన్ అంటూ ప్రత్యేకంగా పేరును కూడా పెట్టారు. తాజాగా మరోసారి దోపిడీ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు ఈ క్రౌబర్ మ్యాన్. ఈ సెలక్టీవ్ దొంగకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఒడిశాకు చెందిన ఈ క్రౌబర్ మ్యాన్ అసలు పేరు హేమంత్ దాస్. గత 35 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్నారు. బాగానే చదువుకున్నప్పటికీ.. బుద్ది మాత్రం దోపిడీల వైపు లాక్కెల్లింది. 1980లో అతను భువనేశ్వర్‌లో కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఓ వివాదం చోటు చేసుకుంది. ఆ ఘటనలో పోలీసులు హేమంత్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆ సమయంలోనే జైలులో ఓ దొంగతో హేమంత్‌కు స్నేహం కుదిరింది. అతని నుంచి ఎన్నో మెళకువలు తెలుసుకున్నాడు హేమంత్. అప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన హేమంత్.. దోపిడీలు స్టార్ట్ చేశాడు. 1986 నుంచి ప్రొఫెషనల్ దొంగగా ఎదిగాడు.

దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బుతో కశ్మీర్, గ్యాంగ్‌టక్, సిమ్లాకు వెళ్లి ఎంజాయ్ చేస్తాడు. ఆ తరువాత మళ్లీ వచ్చి దొంగతనాలు చేస్తుంటాడు. 35 ఏళ్లుగా అతను.. దాదాపు 500 దొంగతనాలు చేయగా.. 5 కోట్ల సంపదను కాజేశాడు. కేవలం నగదును మాత్రమే దోచుకోవడం ఈ దొంగ హేమంత్ ప్రత్యేకత. పోలీసులు ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైలుకు పంపినా హేమంత్ మాత్రం తన బుద్ధిని మార్చుకోలేదు. చోరీ చేసిన సొత్తుతో ఎంజాయ్ చేయటంపైనే హేమంత్ దృష్టి పెడతాడని పోలీసులు చెబుతున్నారు. తాజాగా కటక్‌లో చోరీకి పాల్పడుతుంగా.. హేమంత్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

Marriage: చరిత్రలో నిలిచిపోయేలా పెళ్లి వేడుక.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

Samantha: సామ్-చైతూ విడాకులపై స్పందించిన సమంత తండ్రి.. ఏమన్నారంటే..

Sandalwood Benefits: గంధంతో తళుక్కుమనే అందం.. ఈ ఫేస్‌ ప్యాక్‌లతో నిగారింపు మీ సొంతం.. ఎలా ఉపయోగించాలంటే..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu