Marriage: చరిత్రలో నిలిచిపోయేలా పెళ్లి వేడుక.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Oct 05, 2021 | 2:21 PM

Marriage: సాధారణంగా వివాహం మండపంలోనో, గుడిలోనో లేదా ఇంటి దగ్గర చేసుకుంటారు. కానీ ఇక్కడ ఓ జంట తమ పెళ్లిని ఒక ప్రత్యేకమైన ప్లేస్‌లో చేసుకున్నారు.

Marriage: చరిత్రలో నిలిచిపోయేలా పెళ్లి వేడుక.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..
Marriage

Follow us on

Marriage: సాధారణంగా వివాహం మండపంలోనో, గుడిలోనో లేదా ఇంటి దగ్గర చేసుకుంటారు. కానీ ఇక్కడ ఓ జంట తమ పెళ్లిని ఒక ప్రత్యేకమైన ప్లేస్‌లో చేసుకున్నారు. ఇంత వరకూ ఇలాంటి పెళ్లి ఎక్కడా జరిగి ఉండదు. ఆ పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. నిజంగా ఈ పెళ్లి చరిత్రలో నిలిచిపోతుంది అంటున్నారు నెటిజన్స్‌. మరి ఆ పెళ్లి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికాలో నివసిస్తున్న కరెన్ మహోనీ, బ్రియాన్ రేకు వివాహం జరగాల్సి ఉంది. అయితే వధువు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండగా, కెనడాలో ఆమె కుటుంబం నివసిస్తోంది. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఇటీవల కరోనా కారణంగా ఆయా దేశాలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, కెనడా మధ్య ఉన్న ఆంక్షల కారణంగా వధువు కుటుంబ సభ్యులు ఈ పెళ్లి కోసం న్యూయార్క్‌కు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ జంట వారి పెళ్లి తమ కుటుంబ సభ్యుల మధ్యే జరగాలని నిర్ణయించుకున్నారు. అందుకు పెళ్లి వేదికను ఏకంగా సరిహద్దు వద్దకు మార్చేశారు. అదృష్టవశాత్తు సరిహద్దు భద్రతా సిబ్బందికూడా వారి పెళ్లికి అనుమతించింది. దీంతో న్యూయార్క్‌లోని బర్కి, కెనడాలోని క్యూబెక్ మధ్య ఉన్న జమీసన్ లైన్ బోర్డర్ క్రాసింగ్‌లో వారి పెళ్లి వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరిగింది.

ఈ రకంగా వివాహం చేసుకోవడంపై వధువు కరేనా స్పందిస్తూ.. ‘‘పెళ్లి అనేది ఎవరికైనా జీవితంలో ముఖ్యమైన రోజు. అలాంటి ప్రత్యేకమైన రోజుని నా తల్లిదండ్రులు, నానమ్మ సమక్షంలో జరగాలని నేను కోరుకున్నాను. మా కుటుంబ పెద్ద నానమ్మ ఒక్కరే. నా జీవితంలో సంతోషకరమైన రోజును చూడడంతో పాటు ఆ రోజు ఆమె నా దగ్గర ఉండాలనుకున్నాను. కానీ, అనుకున్నదానికంటే అద్భుతంగా మా పెళ్లి జరిగింది.’’ అని చెప్పుకొచ్చింది. కాగా, ప్రస్తుతం ఈ పెళ్లి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటజన్లు వీరి ఐడియాను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. వీరికి ఆల్‌ది బెస్ట్ అంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

Also read:

Crime News : సిగరెట్‌కు డబ్బులు అడిగినందుకు మహిళ గొంతు కోసి చంపేశాడు.. ఎక్కడంటే..

Facebook, Instagram and Whatsapp down: ఆరు గంటలపాటు ఉత్కంఠ.. రూటర్లలో కాన్ఫిగరేషన్ మార్పుల వల్లే..

Givenchy Fashion: ‘ఉరితాడు దుస్తులు’.. ఉలిక్కిపడ్డ జనాలు.. దెబ్బకు దిగొచ్చి సారీ చెప్పిన కంపెనీ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu