Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook, Instagram and Whatsapp down: ఆరు గంటలపాటు ఉత్కంఠ.. రూటర్లలో కాన్ఫిగరేషన్ మార్పుల వల్లే..

ఆరు గంటలపాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ నిలిచిపోవటంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యల వల్ల...

Facebook, Instagram and Whatsapp down: ఆరు గంటలపాటు ఉత్కంఠ.. రూటర్లలో కాన్ఫిగరేషన్ మార్పుల వల్లే..
Facebook
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 05, 2021 | 2:17 PM

ఆరు గంటలపాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ నిలిచిపోవటంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యల వల్ల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‎కు అంతరాయం కలగటంతో దానిని సరి చేయడానికి ఉద్యోగులు తీవ్రంగా శ్రమించారు. అయితే ఆరు గంటలపాటు ఉద్యోగులు కార్యాలయ భవనంలోకి ప్రవేశించలేకపోయారు. డిజిటల్ బ్యాడ్జ్‌లను కూడా పని చేయలేదని చెప్పారు.

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ సేవలు సోమవారం ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, మెస్సెంజర్‎తో సహా ఫేస్‌బుక్ గొడుగు కింద పని చేస్తున్న అనేక సేవలకు అంతరాయం కలిగింది. ఇన్‌స్టాగ్రామ్, ఓకులుస్‎వీఆర్‎తో సహా నిలిచిపోయాయని ఫేస్‌బుక్ మంగళవారం ఒక అధికారిక బ్లాగ్‎లో పోస్ట్‌ చేసింది. కంపెనీ డేటా సెంటర్ల మధ్య నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను సమన్వయం చేసే రూటర్లలో కాన్ఫిగరేషన్ మార్పుల వల్ల ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది.

ప్రపంచవ్యాప్త అంతరాయం తరువాత ఫేస్‌బుక్ ఉద్యోగులు కొందరు తాము కార్యాలయానికి వెళ్లిన విషయాన్ని వివరించారు. “ఇది ఇక్కడ అల్లకల్లోలం” అని ఒక ఉద్యోగి అసోసియేటెడ్ ప్రెస్ ఫిలిప్ క్రోథర్‌తో అన్నారు. ఫేస్‌బుక్ ఉద్యోగులు వర్క్-జారీ చేసిన సెల్‌ఫోన్ల నుంచి కాల్స్ చేసేటప్పుడు, ఇమెయిల్‌ వచ్చినప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారని, కంపెనీ అంతర్గత కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించడానికి కూడా వారు చాలా ఇబ్బందులు పడ్డారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఉద్యోగులు తమ పనులను చేయడానికి లింక్డ్ఇన్, జూమ్, డిస్కార్డ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించారు.

డిజిటల్ బ్యాడ్జ్‌ల్లో కూడా సమస్య రావటంతో ఉద్యోగులు కార్యాలయ భవనాలు, సమావేశ గదుల్లోకి ప్రవేశించలేకపోయారు. లోపల ఉన్నవారు కూడా వివిధ గదుల్లోకి ప్రవేశించలేకపోయారు. రిమోట్ ఫేస్‌బుక్ సర్వర్లు సరిగా పనిచేయలేదు. చాలా సమయం ఫేస్‌బుక్ దాని అన్ని ప్లాట్‌ఫారమ్స్‎కు అంతరాయం కంపెనీపై తీవ్ర ప్రభావం పడిందని నెట్‌వర్కింగ్ నిపుణుడు టామ్ డాలీ వాల్ స్ట్రీట్ జర్నల్‌తో అన్నారు. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరీ ఈ అంతరాయాన్ని “మంచు రోజు” తో పోల్చారు.

Read Also.. Credit Guarantee Scheme: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఆ స్కీమ్‌ గడువు పొడిగింపు.. ఇప్పటి వరకు అంటే..!