Credit Guarantee Scheme: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఆ స్కీమ్‌ గడువు పొడిగింపు.. ఇప్పటి వరకు అంటే..!

Credit Guarantee Scheme: కేంద్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ గడువును 2022 మార్చి 31 వరకు..

Credit Guarantee Scheme: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఆ స్కీమ్‌ గడువు పొడిగింపు.. ఇప్పటి వరకు అంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 05, 2021 | 2:01 PM

Credit Guarantee Scheme: కేంద్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ గడువును 2022 మార్చి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉండనుంది. దీని వల్ల ఎంఎస్ఎంఈ రంగానికి ప్రయోజనం కలుగనుంది. వీటికి సులభంగానే మరింత కాలం రుణాలు లభించనున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం2020 జూన్ 1 నుంచి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా ఈ స్కీమ్‌ గడువు 2021 సెప్టెంబర్ చివరితో ముగియాల్సి ఉండగా, దానిని మరో ఆరు నెలల పాటు గడువును పొడిగించింది.

కరోనా మహమ్మారి కాలంలో లాక్ డౌన్ సందర్భంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా చాలా మంది చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సులభంగా రుణాలు లభించే సదుపాయాన్ని కల్పించింది కేంద్రం. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రుణాలకు గ్యారంటీ ఇస్తుంది.

అలాగే పండుగ సీజన్ నేపథ్యంలో బ్యాంకులు వరుసగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు నుంచి ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వరకు పలు రకాల బెనిఫిట్స్ అందిస్తున్నాయి. హోమ్ లోన్, పర్సనల్‌ లోన్స్‌ వంటి వాటిపై వడ్డీ రేట్ల తగ్గిస్తున్నాయి. సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ గడువును పొడిగించడంతో ఎంతో మందికి ఊరట కలుగనుంది. లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం చాలా మందికి మేలు జరిగేలా చర్యలు చేపట్టింది. కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థికంగా ఎదిగేందుకు ఇలాంటి రుణాలను ప్రవేశపెట్టింది.

ఇవీ కూడా చదవండి:

UAE Lottery: అబుదాబిలో భారతీయులకు అదృష్టం వరించింది.. రూ.20 కోట్ల లాటరీ.. వారి కోసం నిర్వాహకుల వెతుకులాట..!

Post Office Scheme: రోజూ రూ.95 పెట్టుబడితో రూ.14 లక్షలు మీ సొంతం.. పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. పూర్తి వివరాలు..!