UAE Lottery: అబుదాబిలో భారతీయులకు అదృష్టం వరించింది.. రూ.20 కోట్ల లాటరీ.. వారి కోసం నిర్వాహకుల వెతుకులాట..!

UAE Lottery: ఓ భారతీయ బృందానికి అబుదాబిలో రూ.20 కోట్ల లాటరీ తగిలింది. హైపర్‌ మార్కెట్లో పని చేస్తున్న 40 మంది బృందానికి రూ.20.26కోట్ల విలువైన లాటరీ..

UAE Lottery: అబుదాబిలో భారతీయులకు అదృష్టం వరించింది.. రూ.20 కోట్ల లాటరీ.. వారి కోసం నిర్వాహకుల వెతుకులాట..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 05, 2021 | 1:19 PM

UAE Lottery: ఓ భారతీయ బృందానికి అబుదాబిలో రూ.20 కోట్ల లాటరీ తగిలింది. హైపర్‌ మార్కెట్లో పని చేస్తున్న 40 మంది బృందానికి రూ.20.26కోట్ల విలువైన లాటరీ వరించింది. వీరిలో ఇద్దరు బంగ్లాదేశీయులు కాగా మిగిలిన అందరూ భారతీయులే. ఒకే గదిలో నివసిస్తున్న వీరందరూ కలిసి కేరళకు చెందిన నహీల్‌ నిజాముద్దీన్‌ పేరుతో యూఏఈలో లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. అయితే కరోనా నేపథ్యంలో నహీల్‌ నిజాముద్దీన్‌ను స్వదేశానికి తిప్పి పంపించారు. దీంతో లాటరీ నిర్వాహకులు నహీల్‌ను సంప్రదించలేకపోయారని ఖలీజ్‌టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. నహీల్‌ ఇచ్చిన తల్లిదండ్రుల ఫోన్‌ నంబరు ఆధారంగా లాటరీ గెలుచుకున్నట్లు నిర్వాహకులు తెలియజేశారని పత్రిక పేర్కొంది. లాటరీ ద్వారా లభించిన మొత్తాన్ని 40 మంది పంచుకోనున్నారు.

అయితే లాటరీ దక్కిన విషయాన్ని వీరికి చెబుదామని నిర్వాహకులు ప్రయత్నించినా అందుబాటులో లేకుండా పోయారు. ఆదివారం జరిగిన బిగ్ టికెట్ అబూదాబి సిరీస్‌ 232 డ్రాలో అతడు ఏకంగా 10 మిలియన్ దిర్హామ్‌లు గెలుపొందాడు. సెప్టెంబర్ 26న నహీల్ టిక్కెట్ కొనుగోలు చేయగా, ఇలా అనుకోకుండా అతడిని అదృష్టం వరించింది. ఇక సౌదీ అరేబియాలో నివసిస్తున్న యాంజెలో ఫర్నాండెజ్ ఈ లాటరీలో రెండో బహుమతిగా 1 మిలియన్ దిర్హామ్లను గెలుపొందాడు. అయితే లాటరీ గెలుచుకున్న విషయాన్ని భారత్‌కు చెందిన నహీల్‌కు చేరవేసేంత వరకూ ప్రయత్నిస్తూనే ఉంటామని నిర్వాహకులు పేర్కొన్నారు. లాటరీ టిక్కెట్‌ కొనుగోలు చేసిన సమయంలో అతడు కేరళలో ఉన్న అడ్రస్‌ను ఇచ్చాడు. రెండు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాడు. కానీ.. లాటరీ గెలిచిన విషయాన్ని అతడికి ఫోన్‌ ద్వారా తెలిపేందుకు నిర్వాహకులు ఎంతగా ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. అతడిచ్చిన రెండు ఫోన్ నెంబర్లు పనిచేయట్లేదని రిప్లై వస్తుండటంతో వారు ఆశ్చర్యపోతున్నారు. ఎలాగైన ఈ గుడ్‌న్యూస్‌ను అతనికి చెప్పాలని ప్రయత్నిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారట.

ఇవీ కూడా చదవండి:

iPhone 13 Pro Max: ఈ డాక్టర్‌ మాములోడు కాదు.. ఐఫోన్‌13తో కంటి చికిత్స.. నిపుణుల నుంచి ప్రశంసలు

Android Apps: మీ మొబైల్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి.. 26 డేంజర్‌ యాప్స్‌ను గుర్తించిన గూగుల్‌