Covid Crisis: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్.. రూ.15 వేల నుంచి రూ.75 వేల వరకు.. ఎలా అప్లై చేసుకోవాలంటే

Covid Crisis Support: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచదేశాలను వణికించింది. ఆర్థిక, వ్యాపార, విద్య రంగంపై తీవ్రప్రభావం చూపించింది. ఎందరో కుటుంబ..

Covid Crisis:  కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్.. రూ.15 వేల నుంచి రూ.75 వేల వరకు.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Hdfc Bank Scholarship
Follow us
Surya Kala

|

Updated on: Oct 05, 2021 | 3:34 PM

Covid Crisis Support: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచదేశాలను వణికించింది. ఆర్థిక, వ్యాపార, విద్య రంగంపై తీవ్రప్రభావం చూపించింది. ఎందరో కుటుంబ సభ్యులు తమ ఫ్యామిలీ సభ్యులు, సన్నిహితులను, స్నేహితులను, ఆత్మీయులను కోల్పోయారు. అభంశుభం తెలియని పిల్లలకు తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో నేటి సమాజంలో నిలబడ్డారు. వీరి చదువు ప్రశ్నార్ధకంగా మారింది. అయితే కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలబడడానికి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు అండగా నిలబడటానికి . Covid Crisis Support పేరుతో స్కాలర్ షిప్ ను ప్రకటించింది. కోవిడ్ వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 1 వ తరగతి నుండి పోస్టు గ్రెడ్యుయేషన్ వరకూ 15 వేల నుండి 75 వేల వరకూ స్కాలర్షిప్ ను అందించనుంది. ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేస్తుకోవడానికి చివరి తేదీ.. 31 అక్టోబరు 2021. బడ్డీ 4 స్టడీ వెబ్‌సైట్‌ https://www.buddy4study.com/ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలి తదితర వివరాల్లోకి వెళ్తే..

అర్హతలు:

2020 జనవరి కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన స్టూడెంట్స్.. 1వ తరగతి నుంచి పీజీ వరకూ ఈ స్కాలర్ షిప్ ని అందిస్తారు. కరోనాతో తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికిఅర్హులు. అయితే..  కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షలకు మించకూడదు.

ఎలా అప్లై చేసుకోవాలంటే   బడ్డీ 4 స్టడీ వెబ్‌సైట్‌ https://www.buddy4study.com/ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకునే విద్యార్థి ఈ–మెయిల్ ఐడీ లేదా మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి.  అనంతరం అప్లికేషన్ ఫామ్ ని ఫీల్ చేసి.. అడిగిన డాక్యుమెంట్స్ ని అప్ లోడ్ చేయాలి.

కావలిసిన డాక్యుమెంట్స్:

తల్లిదండ్రుల గుర్తింపు కార్డు, స్కూల్ లేదా కాలేజీ ఐడీ కార్డు, గతేడాది మార్కుల లిస్ట్, స్కూల్ అడ్మిషన్ లెటర్, స్కూల్ ఫీ రిసిప్ట్, వీటితో పాటు తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం, స్కూల్ టీచర్ లేదా డాక్టర్ నుంచి ఆర్ధిక పరిస్థితికి సంబంధించిన రిఫరెన్స్ లెటర్, బ్యాంక్ ఖాతా వివరాలను అప్లికేషన్ ఫీల్ చేసే సమయంలో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

స్కాలర్ షిప్ కు ఎంపిక ప్రక్రియ: 

ఈ స్కాలర్‌షిప్ కు సంబంధించి ఎంపిక ప్రక్రియ పలు  దశల్లో ఉండనుంది. విద్యార్థి మార్కులు, కుటుంబ ఆర్ధిక పరిస్థితి,   వంటి విషయాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అయినా విద్యార్థికి ఒక ఏడాదికి ఒకేసారి స్కాలర్ షిప్ గా మనీ మొత్తం ఇస్తారు.

Also Read:  నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం.. కరోనా వృత్తిపై చూపిన ప్రభావమే ఈ ఏడాది థీమ్..