World Teachers’ Day: నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం.. కరోనా వృత్తిపై చూపిన ప్రభావమే ఈ ఏడాది థీమ్..

World Teachers' Day: ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు మనిషికి జ్ఞానాన్ని పంచి జీవితానికి బాటలు వేసే అక్షర కార్మికుడు.. మనందరికీ విద్యా..

World Teachers' Day: నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం.. కరోనా వృత్తిపై చూపిన ప్రభావమే ఈ ఏడాది థీమ్..
World Teachers Day
Follow us
Surya Kala

|

Updated on: Oct 05, 2021 | 2:58 PM

World Teachers’ Day: ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు మనిషికి జ్ఞానాన్ని పంచి జీవితానికి బాటలు వేసే అక్షర కార్మికుడు.. మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు.  అందుకే పెద్దలు మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అంటూ తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుకి ఇచ్చారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టిన రోజు(సెప్టెంబర్‌ 5)ని భారతీయులు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటుంటే.. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్‌ 5న ‘ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం’గా 1994 నుండి జరుపుకుంటున్నారు.

 దాదాపు 100 దేశాల్లో జరిగే వేడుక: 

సాధారణ ఉపాధ్యాయుడు పాఠాల్ని బోధిస్తాడు. మంచి ఉపాధ్యాయుడు వాటిని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు స్ఫూర్తి అందిస్తాడు. అందుకే మరి గురువులను పూజిస్తూ ఈ రోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని దాదాపు 100 దేశాలు జరుపుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో 1994లో ఆక్టోబర్‌ 5వ తేదీని ‘వరల్డ్‌ టీచర్స్‌ డే’గా ప్రకటించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్స‌వాన్ని అక్టోబ‌ర్ 5వ తేదీన జ‌రుపుకుంటారు. మొద‌టి సారిగా దీన్ని 1994లో ప్రారంభించారు. యునెస్కోతోపాటు ఎడ్యుకేష‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ అనే సంస్థ క‌లిసి వ‌ర‌ల్డ్ టీచ‌ర్స్ డేను నిర్వ‌హిస్తున్నాయి. ఈ రోజు, పాఠశాలలు, కళాశాలలలో వారి ఉపాధ్యాయులకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుని గౌరవిస్తారు.

 ప్రాముఖ్యత: 

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల సేవ విద్యార్థులకు విద్యను అందించడానికి వారు చేసిన కృషిని గుర్తించారు. ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన సవాళ్లను పరిగణలోకితీసుకుని సమస్యలను పరిష్కరించి హక్కులను ఇస్తూ..  బాధ్యతలను తెలియజేస్తారు. 

2021  థీమ్

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 2021 యొక్క థీమ్ ‘విద్య పునరుద్ధరణలో ఉపాధ్యాయులే ముఖ్యపాత్ర. దీంతో యునెస్కో ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో ఉపాధ్యాయ వృత్తిపై కరోనా చూపిన ప్రభావాన్నే థీమ్ గా ఎంచుకుంది ప్రదర్శించాలని సూచించింది.  కరోనావైరస్ మహమ్మారి ఉపాధ్యాయ వృత్తిపై చూపిన ప్రభావాన్ని.. ఉపాధ్యాయులు ఆశాజనకంగా ముందుకు అడుగు వేసిన విధానాన్ని హైలెట్ చేయాలనీ తెలిపింది. బోధనా సిబ్బంది తమ పూర్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునేలా  చూడాలని కోరింది.

ఉపాధ్యాయులకు పాదాభివందనాలు:

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గురువులున్నారు. వీరు ఎంతోమంది విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా తీర్చిద్దిదారు.  అన్నె సలీవాన్‌, నాన్సీ ఎట్‌వెల్‌, హెలెన్‌ కెల్లెర్‌, అల్బర్స్‌ ఐన్‌స్టీన్‌, అరిస్టాటిల్‌, అయాన్‌ ర్యాండ్‌, గెలీలియో, న్యూటన్‌, పైథాగారస్‌, కన్‌ఫ్యూసియస్‌, సర్వేపల్లి రాధాకృష్టన్‌,అబ్దుల్ కలామ్ మొదలైన వారంతా ఎంతోమందిని తీర్చిదిద్ది మరెంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

దక్షిణామూర్తి, విశ్వామిత్రుడు, సాందీపుడు, పరుశురాముడు, ఆదిశంకరాచార్యులు, ద్రోణాచార్య, పరమహంస మొదలైన వారు ఇప్పటికీ గొప్ప గురువుగా పూజలను అందుకుంటున్నారు. గురువుని మనదేశంలోనే కాదు దేశదేశాల్లో కూడా ఎంతో గౌరవిస్తారు.

కన్‌ఫ్యూసియస్‌:

చైనీయులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని కన్‌ఫ్యూసియస్ పుట్టిన రోజైన ఆగస్టు 27న జరుపుకుంటారు. తొలిసారిగా ప్రైవేటు పాఠశాలను ప్రారంభించిన గొప్ప వ్యక్తిగా కనుఫ్యూసియస్‌ పేరు. తత్వవేత్తగా పేరుపొందిన కన్‌ఫ్యూసియస్‌ అనేక విలువైన పుస్తకాలు కూడా రాశారు. టీచర్ గా అనేక మంది విద్యార్థులకు భవిష్యత్ నిచ్చారు.

హెలెన్‌ కిల్లర్‌ స్ఫూర్తి:

అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా వికలాంగుల సారథిగా పేరుపొందిన హెలెన్‌ కిల్లర్‌ ఎందరెందరికో స్ఫూర్తినిచ్చారు. కెల్లర్‌కు విద్యాబుద్ధులు నేర్పిన ఘనత అన్నా సలీవాన్‌దే. ఆ తర్వాత హెలెన్‌ ఎంతో సాధించింది. మహా వక్తగా, విశేష మానసిక శక్తిగా ఎదిగిందంటే దానికి కారణం తను విద్యాబుద్ధులు నేర్చుకోవడమే.

భావి తరాలకు విద్యాప్రణాళికలు ఎలా ఉండాలనే అంశంపై ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టేందుకు విద్యాలయాలలో వేడుకగా దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ప్రధాన లక్ష్యం ‘విశ్వవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలను ప్రశంసించడం వారి నైపుణ్యాలను అంచనావేయడం, వాటిని మెరుగుపరచడం’. బోధనకు సంబంధించిన సమస్యలను చర్చించుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా పరిగణిస్తున్నారు.

Also Read:

చరిత్రలో నిలిచిపోయేలా పెళ్లి వేడుక.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..