Crime News : సిగరెట్‌కు డబ్బులు అడిగినందుకు మహిళ గొంతు కోసి చంపేశాడు.. ఎక్కడంటే..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Oct 05, 2021 | 2:17 PM

Delhi Crime News: దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సిగరేట్‌కు డబ్బులు ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తి మహిళను గొంతు కోసి చంపేశాడు.

Crime News : సిగరెట్‌కు డబ్బులు అడిగినందుకు మహిళ గొంతు కోసి చంపేశాడు.. ఎక్కడంటే..
Arrest

Follow us on

Delhi Crime News: దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సిగరేట్‌కు డబ్బులు ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తి మహిళను గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్వారకా జిల్లాలోని దాబ్రి ప్రాంతం సోమ్ బజార్ రోడ్డులో ఓ కిరాణా షాపు ఉంది. ఆ షాపు వద్దకు సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో దిలీప్ అనే వ్యక్తి వచ్చాడు. సిగరెట్ ఇవ్వాల్సిందిగా కోరగా.. షాపులో ఉన్న మహిళ సిగరెట్ ఇచ్చింది. ఆ క్రమంలో సిగరెట్ డబ్బులకు సంబంధించి మహిళ, దిలీప్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్తా తీవ్ర ఘర్షణగా మారింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన కస్టమర్ దిలీప్.. షాపులో ఉన్న మహిళ గొంతు కోశాడు. రక్తపు మడుగులో పడిఉన్న మహిళను గమనించిన స్థానికులు.. దిలీప్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి.. దిలీప్ దాడిలో గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

కాగా, నిర్ధాక్షిణ్యంగా మహిళను హతమార్చిన దిలీప్‌ను స్థానికులు చావబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి.. నిందితుడు దిలీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల దాడిలో గాయపడిన దిలీప్‌ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే, పోలీసుల తీరుపైనా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఘటనా స్థలంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. నిందితుడిని ఆస్పత్రిలో జాయిన్ చేయించడంపై స్థానికులు నిప్పులు చెరిగారు. పోలీస్ వ్యాన్‌పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఎలాగోలా పోలీసులు అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డారు. అ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. కాగా, నిందితుడు దిలీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స అనంతరం దిలీప్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Also read:

Givenchy Fashion: ‘ఉరితాడు దుస్తులు’.. ఉలిక్కిపడ్డ జనాలు.. దెబ్బకు దిగొచ్చి సారీ చెప్పిన కంపెనీ..

Mumbai Cruise Drug Case: బాలీవుడ్ బాద్ షాకు బాలీవుడ్‌ మద్దతు.. షారుక్‌ ఖాన్‌ ఇంటికి క్యూ కట్టిన ప్రముఖులు

Sonam Kapoor: సన్నజాజి సోనమ్ సొగసుకు ఫిదా అవ్వాల్సిందే.. బాలీవుడ్ బ్యూటీనా మజాకా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu