Mumbai Cruise Drug Case: బాలీవుడ్ బాద్ షాకు బాలీవుడ్‌ మద్దతు.. షారుక్‌ ఖాన్‌ ఇంటికి క్యూ కట్టిన ప్రముఖులు

షారుఖ్, ఆర్యన్‌కి అండగా బాలీవుడ్..క్రూయిజ్‌లో ఆర్యన్ ఖాన్ తప్ప ఎవరూ కనపడలేదా అంటూ ఫైరవుతున్నారు ప్రముఖులు. మరోవైపు బాలీవుడ్ బాద్ షా కుటుంబానికి..

Mumbai Cruise Drug Case: బాలీవుడ్ బాద్ షాకు బాలీవుడ్‌ మద్దతు..  షారుక్‌ ఖాన్‌ ఇంటికి క్యూ కట్టిన ప్రముఖులు
Shah Rukh Khan From Bollywo
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 05, 2021 | 2:13 PM

షారుఖ్, ఆర్యన్‌కి అండగా బాలీవుడ్..క్రూయిజ్‌లో ఆర్యన్ ఖాన్ తప్ప ఎవరూ కనపడలేదా అంటూ ఫైరవుతున్నారు ప్రముఖులు. మరోవైపు బాలీవుడ్ బాద్ షా కుటుంబానికి, ఆర్యన్ కి మద్దతుగా నిలుస్తున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ట్విట్టర్‌లో వుయ్‌ స్టాండ్‌ విత్‌ SRK ట్రెండింగ్‌లో నిలిచింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టవడం, బెయిల్ కూడా రాకపోవడంతో షారుక్ కుటుంబానికి అండగా నిలిచారు బాలీవుడ్‌ ప్రముఖులు, అభిమానులు. షారుక్‌ మేము మీతో ఉన్నామంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

ట్విట్టర్‌లో వుయ్‌ స్టాండ్‌ విత్‌ షారుఖ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆర్యన్ అరెస్ట్ అయినప్పటి నుంచి షారుఖ్ ఖాన్ ఇంటికి బాలీవుడ్ స్టార్స్‌ క్యూ కట్టారు. సల్మాన్ ఖాన్, పూజాభట్‌, అల్విరాఖాన్‌, స్టార్‌ సింగర్‌ మికా సింగ్‌ సహా చాలామంది బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌ స్వయంగా మద్దతు పలుకుతున్నారు. మరికొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. డ్రగ్స్ కేసును తూర్పారబడుతూ, మీకా సింగ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ పెట్టారు. అందమైన కార్డెలియా క్రూయిజ్‌లో చాలా మంది ఉన్నా..ఆర్యన్‌ను తప్ప ఎవరినీ చూడలేకపోయానంటూ వ్యంగ్యంగా పోస్ట్‌ పెట్టారు.

ఇక సుచిత్రా కృష్ణమూర్తి క్రూయిజ్‌లోకి వెళ్లడానికి ఎన్నో రౌండ్ల తనిఖీలు ఉంటాయని..కానీ ఇక్కడ భద్రతా ఉల్లంఘన ఎలా జరిగిందో అర్ధం కావడం లేదన్నారు. ఇది అతని ఇమేజ్‌ని టార్గెట్ చేయడం కోసమే చేసిందని భావిస్తున్నానన్నారు. ఇక ఆర్యన్ ఖాన్ గుడ్ బాయ్ అని సంభోదిస్తూ, గౌరీ స్నేహితురాలు సుస్సాన్ ఖాన్ కూడా విచారం వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లాగే ఇది కూడా త్వరలో సమసి పోతుందంటూ ట్వీట్ చేశారు. ఇక బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు, రాజకీయ నాయకులు కూడా షారుఖ్ ఖాన్‌కు మద్దతు ఇస్తున్నారు.

కాంగ్రెస్ నేత శశి థరూర్ బహిరంగంగా షారుఖ్ ఖాన్‌కు మద్దతిచ్చారు. మీ సరదా కోసం 23 ఏళ్ల యువకుడిని అంతగా ట్రోల్‌ చేయాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. మరోవైపు ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్‌ రాకపోవడంతో కేసు మరింత పటిష్టంగా మారేలా కనిపిస్తోంది. వీళ్లకు డ్రగ్స్‌ ఎవరు సప్లై చేస్తున్నారన్న విషయంపై దృష్టి పెట్టారు ఎన్సీబీ అధికారులు. ఐతే డ్రగ్స్‌ కేసులో అరెస్టై ఎన్సీబీ కస్టడీలో ఉన్న ఆర్యన్‌ ఏడుస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది. ఐతే కొడుకు ఆర్యన్‌తో మాట్లాడిన షారుక్‌ ధైర్యం చెప్పినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:  Priyanka Gandhi: నన్ను ఎందుకు నిర్బంధించారో చెప్పండి.. ప్రధాని మోడీని ప్రశ్నించిన ప్రియాంక..

Aryan Khan drug case: ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మూడ్రోజుల కస్టడీ.. మరో ఇద్దరి అరెస్ట్..