AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సామ్-చైతూ విడాకులపై స్పందించిన సమంత తండ్రి.. ఏమన్నారంటే..

టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ సామ్-చైతూ విడాకులు తీసుకోవడంతో.. సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యింది. సమంత, నాగచైతన్య

Samantha: సామ్-చైతూ విడాకులపై స్పందించిన సమంత తండ్రి.. ఏమన్నారంటే..
Samantha Nagachaitanya
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 05, 2021 | 7:17 PM

Share

టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ సామ్-చైతూ విడాకులు తీసుకోవడంతో.. సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యింది. సమంత, నాగచైతన్య విడిపోవడం పై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా.. అభిమానులు సైతం తీవ్ర నిరాశలో మునిగిపోయారు. మొదటి సినిమాతోనే స్నేహితులుగా మారి.. ఆ తర్వాత ప్రేమవివాహం చేసుకున్ని ఈ జంటకు అభిమానులు ఎక్కువే ఉన్నారు. అయితే వీరిద్దరు విడిపోతున్నారని.. గత కొన్ని నెలలగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై అటు సమంత కుటుంబసభ్యులు గానీ.. ఇటు నాగచైతన్య ఫ్యామిలీ గానీ స్పందించలేదు. ఇక పలుమార్లు ఈ రూమర్స్ అన్ని అవాస్తం అనేలా సామ్, చై రియాక్ట్ అవుతూ వచ్చారు. దీంతో ఈ జంట నిజాంగానే విడిపోవడం లేదని అంతా అనుకున్నారు. కానీ ఆకస్మాత్తుగా తాము విడాకులు తీసుకున్నామని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించి షాకిచ్చారు.

అయితే వీరిద్దరు విడిపోవడానికి గల కారణానాన్ని మాత్రం ఈ జంట ఇప్పటి వరకు చెప్పలేదు. దీంతో వీరిద్దరి విడాకులకు సంబంధించిన కారణాల గురించి నెట్టింట్లో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సామ్, చైతూ విడాకుల ప్రకటన వచ్చిన అనంతరం అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో భావోద్వేగ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సామ్, చైతూ విడాకుల ప్రకటన అనంతరం ఆమె తండ్రి జోసెఫ్ స్పందించారు. ప్రస్తుతం తన మెదడు అంతా శూన్యంగా ఉందని ఆయన తెలిపారు. త్వరలోనే అన్ని పరిస్థితులు మాములుగా మారిపోతాయని.. ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆయనకు మద్దతు ఇస్తూ.. నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విడాకుల ప్రకటన అనంతరం చైతూ ఎలాంటి పోస్ట్ చేయలేదు. కానీ సమంత మాత్రం వరుసగా ఎమోషనల్ పోస్ట్స్ చేస్తూ.. తన పరిస్థితి గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నాగచైతన్య. అలాగే.. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత.. శాకుంతలం సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Sonam Kapoor: సన్నజాజి సోనమ్ సొగసుకు ఫిదా అవ్వాల్సిందే.. బాలీవుడ్ బ్యూటీనా మజాకా..

Rashmi Gautam: రెడ్ డ్రెస్ లో రెడ్ హాట్ గా మెరిసిన ముద్ద మందారం.. అందాల రష్మీ లేటేస్ట్ ఫొటోస్..