Dussehra Holidays: దసరా పండుగ సెలవులను ప్రకటించిన తెలంగాణ సర్కార్.. ఎప్పటి నుంచంటే..
బతుకమ్మ, దసరా పండుగల సెలవులను ప్రకటించింది తెలంగాణ విద్యాశాఖ. బుధవారం నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.
బతుకమ్మ, దసరా పండుగల సెలవులను ప్రకటించింది తెలంగాణ విద్యాశాఖ. బుధవారం నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. దసరా, బతుకమ్మ పండుగలకు తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను తెలంగాణవాసులు ఘనంగా జరుపుకుంటారు. అతి పెద్ద పండుగైన బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ఆడపడుచులు. ఈ రెండు పండుగలను పరస్కరించుకుని ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు అంటే 12 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నట్లుగా తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. తిరిగి ఈ నెల 18న పాఠశాలలు తెరుచుకుంటాయని వెల్లడించింది.
ఇంటర్ కాలేజీ విద్యార్థులకు కూడా సెలవులను ప్రకటించారు. ఇదిలావుంటే ఈ 13 నుంచి ఇంటర్ కాలేజీలకు సెలవును ఇవ్వనున్నారు. ఇంటర్ కాలేజీలకు ఈ నెల 13వ తేదీ నుంచి సెలవులివ్వనున్నారు. 13 నుంచి 16 వరకు నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. తిరిగి 17న కాలేజీలు ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు.
ఇదిలావుంటే.. దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. దసరా పండుగ నేపథ్యంలో ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ ఆ ప్రకటనలో పేర్కొంది. పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,045 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
వీటిలో 3,085 బస్సులను తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడుపుతుండగా.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రద్దీని బట్టి 950 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు. కాగా, మొన్నటి వరకు సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్.. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక మార్పులకు శ్రీకారం చుడుతూ వస్తున్నారు. ఆర్టీసీ డెవలప్‌మెంట్ కోసం కార్యాచరణ చేపడుతున్నారు.
ఇదిలాఉంటే.. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి(6వ తేదీ) ఈ నెల 17వ తేదీ వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ఈనెల 18వ తేదీన తిరిగి పాఠశాలలుు పునఃప్రారంభం అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి: Lakhimpur Kheri Viral Video: అన్నదాతలపైకి దూసుకెళ్లిన కారు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..