Hyderabad: సీఐ నాగేశ్వరరావు కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

రాష్ట్రవ్యాప్తంగా (Hyderabad) సంచలనం సృష్టించిన మారేడ్ పల్లి సీఐ నాగేశ్వరరావు కేసులో (CI Nageshwara rao Case) సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. అధికారుల దర్యాప్తులో...

Hyderabad: సీఐ నాగేశ్వరరావు కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Ci Nageshwararao
Follow us

|

Updated on: Jul 13, 2022 | 4:40 PM

రాష్ట్రవ్యాప్తంగా (Hyderabad) సంచలనం సృష్టించిన మారేడ్ పల్లి సీఐ నాగేశ్వరరావు కేసులో (CI Nageshwara rao Case) సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. అధికారుల దర్యాప్తులో సీఐ నాగేస్వరరావు నేరం అంగీకరించారు. దీంతో హత్యాయత్నం, అత్యాచారం, బెదిరింపులతో ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. వెంకటరమణ కాలనీలో రాత్రి 9:30 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీఐ సర్వీస్‌ రివాల్వర్‌, దుస్తులు సేకరించారు. బాధితురాలి ఇంటి దగ్గరలోని ఎలక్ట్రికల్‌ షాప్‌లో సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. అనంతరం బాధితురాలికి మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు. రిపోర్టు విషయాలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించగా.. నివేదిక రావాల్సి ఉంది. సీన్‌ ఆఫ్ ఆఫెన్స్‌లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. రెండు గాజులు, తల వెంట్రుకలు, బెడ్‌షీట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం కారు ప్రమాదం గురించి వివరాలు సేకరించారు. సాగర్‌ కాంప్లెక్స్‌ వద్ద కారు ప్రయాణించిన సీసీ ఫుటేజ్‌ ను అదుపులోకి తీసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.

కాగా.. ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయాడు మారేడ్ పల్లి సీఐ నాగేశ్వరరావు. ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సి ఐ గా డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐ వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న రాత్రి ఆ సీఐని వనస్థలిపురం పోలీసులు అదుపులో కి తీసుకున్నారు. విచారణ అనంతరం సీఐ నాగేశ్వర రావును ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles