Hyderabad: బాచుపల్లిలో దారుణం.. కాలేజ్‌ భవనంపై నుంచి పడి ఇంటర్‌ విద్యార్థిని మృతి.

హైదరాబాద్‌ శివారులోని బాచుపల్లిలో దారు సంఘటన చోటు చేసుకుంది. నారాయణ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న వంశిత అనే విద్యార్థిని భవనంపై నుంచి పడి మృతి చెందింది. కాలేజ్‌ బిల్డింగ్‌ ఐదోఅంతస్తు నుంచి కిందపడ్డ వంశిత. కామరెడ్డిజిల్లాకు చెందిన విద్యార్థిని..

Hyderabad: బాచుపల్లిలో దారుణం.. కాలేజ్‌ భవనంపై నుంచి పడి ఇంటర్‌ విద్యార్థిని మృతి.
Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 13, 2023 | 12:16 PM

హైదరాబాద్‌ శివారులోని బాచుపల్లిలో దారు సంఘటన చోటు చేసుకుంది. నారాయణ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న వంశిత అనే విద్యార్థిని భవనంపై నుంచి పడి మృతి చెందింది. కాలేజ్‌ బిల్డింగ్‌ ఐదోఅంతస్తు నుంచి కిందపడ్డ వంశిత. కామరెడ్డిజిల్లాకు చెందిన విద్యార్థిని రాగుల వంశిత వారం రోజుల క్రితమే నారాయణ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ..ఈ ఉదయం కాలేజ్‌ భవనం వెనుకవైపు విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంది.

ఈ విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం బాచుపల్లి పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. స్పాట్‌కి వచ్చిన పోలీసులు విద్యార్థిని మృతిపై ఆరా తీశారు. వంశిత బిల్డింగ్‌పై నుంచి దూకేసిందా..? లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థిని వంశితది ఆత్మహత్యానా..? లేక హత్యానా..? వారం రోజుల క్రితమే కాలేజీలో చేరిన వంశితకు అక్కడి వాతావరణం నచ్చలేదా..? లేక చదువు ఒత్తిడి తట్టుకోలేక పోయిందా..? అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు…డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..