ICC World Cup 2023: హైదరాబాదీలకు బ్యాడ్‌ న్యూస్‌.. ఉప్పల్‌ మైదానంలో టీమిండియా మ్యాచుల్లేవ్‌..

ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో టీమిండియా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకుంటోన్న హైదరాబాదీలకు బీసీసీఐ నిరాశ మిగిల్చింది. ఈ మెగా టోర్నీలో అన్ని ప్రధాన స్టేడియాల‌్లో టీమ్ఇండియా మ్యాచ్‌ల‌కు అవ‌కాశాన్ని క‌ల్పించిన బీసీసీఐ.. ఉప్పల్ స్టేడియాన్ని మాత్రం విస్మరించింది. తాజాగా రిలీజైన వన్డే వరల్డ్‌ కప్‌ డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌ను పరిశీలిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది.

ICC World Cup 2023: హైదరాబాదీలకు బ్యాడ్‌ న్యూస్‌.. ఉప్పల్‌ మైదానంలో టీమిండియా మ్యాచుల్లేవ్‌..
Hyderabad Uppal Stadium
Follow us
Basha Shek

|

Updated on: Jun 13, 2023 | 11:27 AM

ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో టీమిండియా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకుంటోన్న హైదరాబాదీలకు బీసీసీఐ నిరాశ మిగిల్చింది. ఈ మెగా టోర్నీలో అన్ని ప్రధాన స్టేడియాల‌్లో టీమ్ఇండియా మ్యాచ్‌ల‌కు అవ‌కాశాన్ని క‌ల్పించిన బీసీసీఐ.. ఉప్పల్ స్టేడియాన్ని మాత్రం విస్మరించింది. తాజాగా రిలీజైన వన్డే వరల్డ్‌ కప్‌ డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌ను పరిశీలిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఇది డ్రాఫ్ట్‌ షెడ్యూల్ అయినప్పటికీ దీనినే ఫైనల్ చేసే అవకాశం లేకపోలేదు. దీంతో హైదరాబాదీ క్రికెట్‌ ఫ్యాన్స్‌ను నిరాశకు లోనవుతున్నారు. అయితే.. ఉప్పల్‌లో పాకిస్థాన్ మాత్రం రెండు క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది. పాకిస్థాన్‌కు ఉప్పల్‌లో ఛాన్స్ ఇచ్చి టీమ్ఇండియాకు అవ‌కాశం ఇవ్వక‌పోవ‌డం హైదరాబాద్  క్రికెట్ ఫ్యాన్స్‌ను డిజ‌పాయింట్‌ కు గురిచేస్తోంది. కాగా ప్రపంచకప్‌ లీగ్ దశలో టీమిండియా మొత్తం 9 మ్యాచ్‌లు ఆడనుంది. చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, పుణే, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

2011లోనూ అన్యాయమే..

వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌పై, అందులోనూ ఉప్పల్ స్టేడియంలో టీమిండియాకు మ్యాచ్‌లు లేకపోవడంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో కొందరు నెటిజన్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ హైదరాబాద్‌కు అన్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా భారత్‌ మ్యాచ్‌లు కేటాయించకుండా పాకిస్తాన్‌ మ్యాచ్‌లు ఆడిస్తున్నారంటూ, దీనిపై మాట్లాడాంటూ ఫ్యాన్స్‌ రిక్వెస్టులు పంపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..