భగభగ.. మండిపోతున్న సూరీడు.! హైదరాబాదీలకు హై-అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో..

రోహిణి కార్తెలో రొళ్లు పగిలే ఎండలు ఉంటాయి అని చెబుతుంటారు. ఈ మాట ఎక్కువగా వేసవికాలంలో వినిపిస్తూ ఉంటుంది. అయితే మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు రోళ్ళు పగిలే ఎండలు ఉన్నాయన్నది నానుడి. కానీ ఈసారి మాత్రం..

భగభగ.. మండిపోతున్న సూరీడు.! హైదరాబాదీలకు హై-అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో..
Heat Wave
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 03, 2024 | 1:45 PM

రోహిణి కార్తెలో రొళ్లు పగిలే ఎండలు ఉంటాయి అని చెబుతుంటారు. ఈ మాట ఎక్కువగా వేసవికాలంలో వినిపిస్తూ ఉంటుంది. అయితే మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు రోళ్ళు పగిలే ఎండలు ఉన్నాయన్నది నానుడి. కానీ ఈసారి మాత్రం ఏప్రిల్‌లోనే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది వాతావరణ శాఖ.

రాష్ట్రంలో అన్ని జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. అత్యధికంగా నిజామాబాద్‌లో 41.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. మెదక్‌లో 40 డిగ్రీలు, రామగుండంలో 40 డిగ్రీలతో పాటు ఖమ్మంలో 45 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీలు, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి గ్రేటర్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా నగరం భగ.. భగమంటోంది.

నగరంలోని రాజేంద్రనగర్ ఏరియాలో 40.1 ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. పటాన్‌చెరువులో 40 డిగ్రీలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. చిన్న పిల్లలు, వృద్దులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. బయటికి వెళ్లేటప్పుడు ఎనర్జీ డ్రింక్స్‌తో పాటు గొడుగు, కళ్ళకి గాగుల్స్, కాటన్ దుస్తులను వేసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెబుతున్నారు. రాగల నాలుగైదు రోజుల పాటు ఇదే ఉష్ణోగ్రతలు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్