AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Rents: హైదరాబాద్‌లో ఏ ప్రాంతంలో అద్దెలు తక్కువ? ఎక్కడ ఎక్కువ? చెక్ చేసుకోండి!

హైదరాబాద్ అంటేనే మహానగరం.. విద్య, వైద్యం, ఉపాధి అన్ని సెక్టార్స్ కు అనుకూలంగా ఉండటంతో ఎంతోమంది భాగ్యనగారానికి వస్తుంటారు. అయితే సిటీకి జనాల తాకిడి పెరిగిపోవడంతో అద్దెలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దీంతో అద్దెల బాధ నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిలు, అబ్బాయిలు కోలివింగ్ ఆప్షన్ ను ఎంచుకుంటూ కలిసి ఉంటున్నారు. ఇక ఐటీ ఉద్యోగులు కూడా తమ తమ స్నేహితులతో రూమ్స్ ను షేర్ చేసుకుంటున్నారు.

Hyderabad Rents: హైదరాబాద్‌లో ఏ ప్రాంతంలో అద్దెలు తక్కువ? ఎక్కడ ఎక్కువ? చెక్ చేసుకోండి!
Rented House
Balu Jajala
|

Updated on: Apr 03, 2024 | 5:43 PM

Share

హైదరాబాద్ అంటేనే మహానగరం.. విద్య, వైద్యం, ఉపాధి అన్ని సెక్టార్స్ కు అనుకూలంగా ఉండటంతో ఎంతోమంది భాగ్యనగారానికి వస్తుంటారు. అయితే సిటీకి జనాల తాకిడి పెరిగిపోవడంతో అద్దెలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దీంతో అద్దెల బాధ నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిలు, అబ్బాయిలు కోలివింగ్ ఆప్షన్ ను ఎంచుకుంటూ కలిసి ఉంటున్నారు. ఇక ఐటీ ఉద్యోగులు కూడా తమ తమ స్నేహితులతో రూమ్స్ ను షేర్ చేసుకుంటున్నారు. అయితే చాలామంది రూమ్ షేరింగ్ చేసుకుంటుండగా, మరికొంతమంది సిటీకి దూరంలో అద్దెకు ఉంటున్నారు. ఇక హైదరాబాద్ లో 2బీహెచ్ కే, 3బీహెచ్ కే ఇళ్లు దొరకక అనేక మంది శివారు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

సిటీ పశ్చిమ పరిధిలోని గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అద్దెలు గత ఏడాదిలో సగటున 20 శాతం పెరిగాయి. ఐటీ ఉద్యోగుల రాకతో అద్దెలు పెరిగాయి. హైదరాబాద్ లో 2బీహెచ్ కే, 3బీహెచ్ కే సహా ఇళ్ల అద్దెలు పెరగడానికి ఐటీ, ఇతర ఉద్యోగుల రాకే కారణమని పలు రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నాయి. దీనికితోడు డిపాజిట్లకు ఉన్న డిమాండ్ కూడా అద్దెదారులు శివారు ప్రాంతాలకు వెళ్లేలా చేస్తోంది. 3-4 నెలల అద్దెను డిపాజిట్ గా ఇవ్వాలని ఇంటి ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న అద్దెలకు చాలామంది ఇళ్ల కోసం నగరం నడిబొడ్డు నుండి 20-30 కిలోమీటర్ల దూరం వెళుతున్నారు. మరోవైపు 2బీహెచ్ కె, 3బీహెచ్ కె ఇళ్ల అద్దెలు పెరగడానికి కరోనా సమయంలో జరిగిన నష్టాలే కారణమని ప్రాపర్టీ యజమానులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ లో 2బిహెచ్ కె, 3బిహెచ్ కె ఇళ్ళ సగటు అద్దెలు వివిధ ప్రాంతాలలో మారుతూ ఉంటాయి.

ఐటీ కారిడార్ లో సగటున రూ.40 వేలు, రూ.30 వేలు అద్దెలు ఉండగా, మణికొండలో రూ.30 వేలు, రూ.35 వేలు ఉన్నాయి. బేగంపేటలో రూ.20 వేలు, రూ.30 వేలు, కూకట్పల్లిలో రూ.30 వేలు, రూ.35 వేలు అద్దెలు ఉన్నాయి. నగరంలోని పశ్చిమ, ఉత్తర, తూర్పు జోన్లలో అద్దెలు ఎక్కువగా ఉన్నప్పటికీ, సౌత్ జోన్లో అవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇటీవల ఈ ప్రాంతానికి మకాం మార్చిన రాజేంద్ర నగర్ నివాసి నజ్మా సుల్తానా మాట్లాడుతూ సిటీ దూరంగా ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ ప్రాంతంలో అద్దెలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో 2బీహెచ్కే, 3బీహెచ్కే ఇళ్లకు సగటున రూ.10 వేలు, రూ.12 వేలు అద్దెలు ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ లో అద్దెలు పెరగడంతో చాలా మంది అద్దెదారులు నగర శివార్లకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు.