AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఎస్సార్ నగర్ హాస్టల్స్ ఉన్న ప్రాంతాల్లో వెలసిన బ్యానర్లు.. ఏం రాసి ఉందంటే…

హైదరాబాద్ ఎస్సానగర్ EWS కాలనీ వాసులకు పెద్ద చిక్కొచ్చి పడింది. మెున్నటి వరకు కూల్‌గా.. తమ పని తాము చేసుకున్న కాలనీ వాళ్లు ఇప్పుడు తెగ హైరానా పడుతున్నారు. తమ గోడును జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసుల ముందు వెళ్లగక్కారు. అయినా సమస్యకు పరిస్కారం దక్కకపోవడంతో త్వరలోనే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసేందుకు రెడీ అయ్యారు.

Hyderabad: ఎస్సార్ నగర్ హాస్టల్స్ ఉన్న ప్రాంతాల్లో వెలసిన బ్యానర్లు.. ఏం రాసి ఉందంటే...
Sr Nagar Locals
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Feb 11, 2025 | 12:54 PM

Share

EWS కాలనీలో బోలెడన్నీ ప్రవేట్ హాస్టల్స్ ఉన్నాయి. వాటి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతూ ఉండటంతో.. కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో కాలనీలో హౌసింగ్ బోర్డు ఇళ్ల నిర్మాణం చేపట్టింది.. అవన్నీ కూడా సుమారు 100 గజాలలోపే ఉంటాయి. రోడ్ల వెడల్పు కూడా తక్కువే. అలాంటి కాలనీలో కొందరు ప్రైవేటు హాస్టల్స్ ఏర్పాటకు తెరలేపారు. ఒకదాని వెంట ఒకటి కొత్త హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ హాస్టల్స్ ఏర్పాటుతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ స్థానిక అవసరాలకు తగినట్లుగా మాత్రమే వనరులు, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ హాస్టల్ పెడితే.. 50 నుంచి 100 మంది అందులో జాయిన్ అవుతున్నారు. దీంతో వనరులు సరిపోవడం లేదు. అంతేకాక యువతీ యువకులు రాత్రిళ్లు కూడా చాలా సమయంలో రోడ్డు మీదే ఉంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ గుంపులు.. గుంపులుగా కూర్చుని హంగామా చేస్తున్నారు. దీంతో రోడ్డుపై నడవాలంటే పిల్లలు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇక చాలామంది రోడ్లపైనే వాహనాలు పార్క్ చేస్తూ ఉండటంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది.

ఈ హాస్టల్స్ సమస్యలపై చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో కాలనీలో పలు చోట్ల బ్యానర్స్ ఏర్పాటు చేశారు. కాలనీల్లో హాస్టల్స్ నిర్వహణకు అనుమతి లేదని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం కాలనీలో 10కి పైగా వసతి గృహాలు ఉండగా.. మరికొన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో మున్ముందు ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి  

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?