AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఎయిర్‌పోర్ట్‌లో తింగరిగా ప్రవర్తిస్తున్న యువతి.. అదుపులోకి తీసుకుని చెక్ చేయగా..

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బ్యాంకాక్ నుంచి ఓ ప్లైట్ వచ్చింది. అయితే ఆ విమానం దిగిన ఓ యువతి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంది. కాసేపు గమనించిన అధికారులు వెంటనే ఆమె అదుపులోకి తీసుకున్నారు. వివరాలు అడిగిన తర్వాత.. తన లగేజ్ తనిఖీ చేశారు ...

Hyderabad: ఎయిర్‌పోర్ట్‌లో తింగరిగా ప్రవర్తిస్తున్న యువతి.. అదుపులోకి తీసుకుని చెక్ చేయగా..
Shamshabad Airport
Ram Naramaneni
|

Updated on: Sep 04, 2025 | 4:38 PM

Share

హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల యువతి సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా, ఆమెను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. 3.1 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని ఆమె బ్యాగులో దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ గంజాయిని నాలుగు ప్యాకెట్లలో కట్టి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ 3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

నిందితురాలు ఇండిగో విమానం 6E-1068 ద్వారా శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో.. భద్రతా సిబ్బంది ఆపి.. బ్యాగులను తనిఖీ చేశారు. దీంతో 3.1 కిలోల గంజాయి దొరికింది. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రస్తుతం కేసు పై మరింత దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గతంలో కూడా ఇలా గంజాయి రవాణా చేసిందా..? దీని వెనక ఏదైనా పెద్ద నెట్ వర్క్ ఉందా అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!
బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ కట్..! ప్రభుత్వం క్లారిటీ..
ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ కట్..! ప్రభుత్వం క్లారిటీ..