సమ్‌థింగ్ స్పెషల్‌గా.. ఓరుగల్లులో పల్లెటూరి బొజ్జ గణపయ్య మండపం సెట్టింగ్! వీడియో చూశారా..
గణపతి నవరాత్రి ఉత్సవాలలో సంథింగ్ స్పెషల్ గా నిలిచింది. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరువాడ గణపతి భక్తి పాటలు, పూజలతో దద్దరిల్లిపోతుంది. లక్షలాది రూపాయలు వెచ్చించి మండపాలు సెట్టింగ్, విగ్రహాలు ప్రతిష్టించిన ఉత్సవ కమిటీలు భక్తిశ్రద్ధలతో పూజ నిర్వహిస్తున్నారు. కొందరైతే భక్తులను ఆకట్టుకోవడం కోసం..
వరంగల్, సెప్టెంబర్ 4: పల్లెటూరి జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా వరంగల్ లో ఓ గణపతి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన సెట్టింగ్ ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. ఆహా అనిపించే ఆ డిఫరెంట్ థీమ్ కు వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ నుండి ప్రత్యేక గుర్తింపు లభించింది. చూడగానే మైమరిచిపోయేలా చేస్తున్నా పల్లెటూరి గణనాథుడి వినాయక మండపం ఎలా సెట్ చేశారో మీరే చూడండి. డిఫరెంట్ థీమ్స్‌తో సెట్టింగ్ చేసిన గణపతి మండపం ఓరుగల్లు ప్రజలను ఆహా అనిపిస్తుంది. పచ్చటి పల్లెదనం ఉట్టిపడేలా అక్కడ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన పల్లెటూరు జీవనం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
గణపతి నవరాత్రి ఉత్సవాలలో సంథింగ్ స్పెషల్ గా నిలిచింది. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరువాడ గణపతి భక్తి పాటలు, పూజలతో దద్దరిల్లిపోతుంది. లక్షలాది రూపాయలు వెచ్చించి మండపాలు సెట్టింగ్, విగ్రహాలు ప్రతిష్టించిన ఉత్సవ కమిటీలు భక్తిశ్రద్ధలతో పూజ నిర్వహిస్తున్నారు.. కొందరైతే భక్తులను ఆకట్టుకోవడం కోసం పోటాపోటీగా లక్షలాది రూపాయలు వెచ్చించి వెరైటీ వెరైటీ మండపాలు ప్రతిష్టించారు. అయితే వరంగల్ చౌరస్తాలోని కొండూరువారి వీధిలో కాకతీయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి సెట్టింగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. పల్లె జీవనం ఉట్టిపడేలా పూర్తిగా డిఫరెంట్ థీమ్ తో ఇక్కడ సెట్టింగ్ చేశారు.. పల్లెటూరి ఆహారపు అలవాట్లు, కులవృత్తులు, వ్యవసాయం, చేద బావి, పూర్తిగా పల్లెటూరి జీవనాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ వినాయక మండపాన్ని తీర్చిదిద్దారు. వరంగల్ లో ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటున్న ఈ గణనాధుని మండపంకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది. దీంతో ఉత్సవ కమిటీ ఆనందంతో మురిసిపోతున్నారు. ఇక్కడ గణపతి దర్శనం కోసం వచ్చే భక్తులు అబ్బురపరిచే సెట్టింగ్ చూసి మైమరచిపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

