AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అక్కడ పోకిరీల ఆగడాలపై పోలీసుల ప్రత్యేక నిఘా.. తేడా వస్తే తాట తీస్తారు..

Hyderabad: అమ్మాయిలపై దేధింపులకు దిగుతూ ఈవ్‌ టీజింగ్ చేసే పోకిరీలకు హైదరాబాద్‌ పోలీసులు (Hyderabad Police) బడిత పూజ చెప్పేందుకు సిద్ధమయ్యారు. వేధింపులకు దిగిన తర్వాత, అమ్మాయిలు ఫిర్యాదు చేసేంత వరకు వేచి చూడకుండా..

Hyderabad: అక్కడ పోకిరీల ఆగడాలపై పోలీసుల ప్రత్యేక నిఘా.. తేడా వస్తే తాట తీస్తారు..
Narender Vaitla
|

Updated on: Apr 23, 2022 | 5:11 PM

Share

Hyderabad: అమ్మాయిలపై దేధింపులకు దిగుతూ ఈవ్‌ టీజింగ్ చేసే పోకిరీలకు హైదరాబాద్‌ పోలీసులు (Hyderabad Police) బడిత పూజ చెప్పేందుకు సిద్ధమయ్యారు. వేధింపులకు దిగిన తర్వాత, అమ్మాయిలు ఫిర్యాదు చేసేంత వరకు వేచి చూడకుండా రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకొని వెంటనే యాక్షన్‌ తీసుకోనున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో షీటీమ్స్‌ (She Teams) ఆధ్వర్యంలో డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని కేబుల్‌ బ్రిడ్జిపై ఇటీవల పర్యాటకుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా రాత్రి పూట విద్యుత్‌ దీపాలతో అద్భుతంగా కనిపించే కేబుల్‌ బ్రిడ్జిని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. దీంతో కొందరు ఆకతాయిలు అమ్మాయిలపై ఈవ్‌ టీజింగ్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. దీంతో ఈ విషయం కాస్త అధికారుల దృష్టికి రావడంతో చర్యలకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే కేబుల్‌ బ్రిడ్జిపై పోలీసులు మఫ్టీలో గస్తీ కాస్తున్నారు.

ఈ వివరాలను వెల్లడిస్తూ.. ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ సేఫ్టీ వింగ్ సైబరాబాద్‌ ట్విట్టర్‌ పేజీలో గస్తీలో ఉన్న కొందరు పోలీసుల ఫొటోలు పోస్ట్‌ చేస్తూ.. ‘సైబరాబాద్ మాదాపూర్ జోన్ పరిధిలో కేబుల్ బ్రిడ్జిపై ఈవ్‌ టీజింగ్, అమ్మాయిలపై వేధింపులు లాంటివి జరగకుండా షీటీమ్స్‌తో డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించి నిఘా ఉంచాం. మహిళలపై ఎలాంటి దుస్సంఘటనలకు ఆస్కారం లేకుండా షీ టీమ్స్‌బహిరంగ ప్రదేశాల్లో నిత్యం నిఘా పెడుతూనే ఉంటాయి’ అని రాసుకొచ్చారు.

మరిన్ని హైదరాబాద్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Also Read: TSTET: టీఎస్ టెట్ అప్లికేషన్‌లో తప్పులు.. అభ్యర్థుల టెన్షన్.. సవరణకు అవకాశం ఇచ్చేనా?..

లేటెస్ట్ ఫోటోలో సన్నీ స్టన్నింగ్ లుక్స్

Number Plate: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ.. ఆ ఒక్క నెంబర్ కోసం రూ. 70 కోట్లు పెట్టాడు..