Summer Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ నగరాల మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్
వేసవి ప్రారంభమవడంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. తద్వారా బస్సులు, రైళ్లలో రద్దీ నెలకొంది. ఈ రద్దీని గమనించిన దక్షిణ మధ్య రైల్వే(SCR) అధికారులు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు. రద్దీ అధికంగా ఉండే...
వేసవి ప్రారంభమవడంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. తద్వారా బస్సులు, రైళ్లలో రద్దీ నెలకొంది. ఈ రద్దీని గమనించిన దక్షిణ మధ్య రైల్వే(SCR) అధికారులు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు. రద్దీ అధికంగా ఉండే కాకినాడ – సికింద్రాబాద్ మార్గంలో రైళ్లు నడపనున్నారు. విజయవాడ శాటిలైట్ స్టేషన్ రాయనపాడు మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్(Secunderabad) – కాకినాడ టౌన్(Kakinada Train) ప్రత్యేక రైలు (07193) 23 న రాత్రి 11.55 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి, రేపు ఉదయం 10.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. కాకినాడ టౌన్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07194) 24వ తేదీ (రేపు) రాత్రి 8.45 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట, మౌలాలీ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Also Read
Acharya Pre Release Event: మెగా సందడి షూరు.. ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..
Ram Charan: నీ నటన మైండ్ బ్లోయింగ్..కేజీఎఫ్ 2 అద్భుతం.. యశ్ పై చరణ్ ప్రశంసలు..