AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.1.50 కోట్ల చిట్టీల మోసం.. కష్టార్జితం కోల్పోయిన బాధితులకే ఐపీ నోటీసులు.. సిద్దిపేటలో తీవ్ర కలకలం!

సిద్దిపేట జిల్లాలో నమ్మకమే పెట్టుబడిగా సాగిన చిట్టీల వ్యాపారం తీవ్ర విషాదాన్ని, వివాదాన్ని మిగిల్చింది. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు కూడబెట్టుకున్న సుమారు రూ.1.50 కోట్ల సొమ్మును ఓ వ్యాపారి టోకరా వేసిన ఘటన చేర్యాల పట్టణ శివారులోని బీడీ కాలనీలో వెలుగులోకి వచ్చింది. బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాల్సింది పోయి, ఏకంగా కోర్టు ద్వారా వారికే ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ (IP) నోటీసులు పంపించడంతో బాధితులు తీవ్ర ఆగ్రహంతో ఆందోళనకు దిగారు.

రూ.1.50 కోట్ల చిట్టీల మోసం.. కష్టార్జితం కోల్పోయిన బాధితులకే ఐపీ నోటీసులు.. సిద్దిపేటలో తీవ్ర కలకలం!
Siddipet Chit Fund Scam
P Shivteja
| Edited By: |

Updated on: Nov 02, 2026 | 9:29 PM

Share

నమ్మకమే పెట్టుబడిగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ సుమారు 1.50 కోట్ల మేర టోకరా వేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది..దీనికి తోడు చిట్టీలు కట్టి మోసపోయిన బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాల్సింది పోయి..ఆ నిర్వాహకుడు కోర్టు ద్వారా బాధితులకే ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) నోటీసులు పంపడం వివాదాస్పదంగా మారింది.దీంతో తమ కష్టార్జితం కోల్పోయిన బాధితులు ఆదివారం నిర్వాహకుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ శివారులోని బీడీ కాలనీ కేంద్రంగా మహ్మద్ అజీజ్ అహ్మద్ కొంతకాలంగా అనధికారికంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

ప్రారంభంలో లావాదేవీలు సజావుగా సాగడంతో కాలనీవాసులు అతడిని నమ్మి పెద్ద సంఖ్యలో చిట్టీలు వేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణాలు, కుటుంబ అవసరాల కోసం పైసాపైసా కూడబెట్టుకున్న డబ్బులను చిట్టీల్లో పెట్టుబడిగా పెట్టారు. అయితే కొంతకాలం తర్వాత చిట్టీలు ఎత్తుకున్న వారికి డబ్బులు చెల్లించకుండా నిర్వాహకుడు జాప్యం చేయడం మొదలుపెట్టాడు..ఇతర సభ్యులు వాయిదాలు చెల్లించడం లేదంటూ సాకులు చెబుతూ కాలయాపన చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

బాధితులకే ఐపీ నోటీసులు..తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బాధితులు ఒత్తిడి పెంచడంతో నిర్వాహకుడు అజీజ్ అహ్మద్ కోర్టును ఆశ్రయించాడు…తాను ఆర్థికంగా నష్టపోయానని, అప్పులు తీర్చే స్థోమత లేదని పేర్కొంటూ ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో బాధితులకు కోర్టు నుంచి ఐపీ నోటీసులు అందాయి. తాము చిట్టీల రూపంలో డబ్బులు చెల్లించినప్పటికీ, తమను అప్పుదారులుగా చిత్రీకరిస్తూ నోటీసులు పంపించారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ చిట్టీలు వేసిన వారిలో చాలా మంది పెడవాళ్లే ఉన్నారు..ఎక్కువగా వితంతువులు, దినసరి కూలీలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పలువురు బాధితులు తమ జీవితకాల పొదుపును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు..కోర్టు నోటీసులతో తమకు సంబంధం లేదని, తాము చెల్లించిన ప్రతి పైసా తిరిగి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు…డబ్బులు చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.అనంతరం ఈ వ్యవహారంపై జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు బాధితులంతా కలిసి సీపీ కార్యాలయానికి తరలివెళ్లారు.తమకు న్యాయం చేసి, చిట్టీల పేరుతో జరిగిన మోసంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us