AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddarth Malhotra-Kiaraa Advani: బ్రేకప్ చెప్పేసుకున్న లవ్‏బర్డ్స్ ?.. ప్రియురాలితో విడిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వైపు పెళ్లి బజాలు మోగుతుంటే.. మరోవైపు బ్రేకప్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నాలుగేళ్లుగా ప్రేమలో మునిగితేలిన అలియా.

Siddarth Malhotra-Kiaraa Advani: బ్రేకప్ చెప్పేసుకున్న లవ్‏బర్డ్స్ ?.. ప్రియురాలితో విడిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో..
Siddarth Kiara
Rajitha Chanti
|

Updated on: Apr 23, 2022 | 6:16 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వైపు పెళ్లి బజాలు మోగుతుంటే.. మరోవైపు బ్రేకప్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నాలుగేళ్లుగా ప్రేమలో మునిగితేలిన అలియా.. రణబీర్ పెళ్లి బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే. అయితే బీటౌన్‏లో ఉన్న మరో అందమైన ప్రేమజంట మాత్రం పెళ్లి వరకు వచ్చి బ్రేకప్ చెప్పేసుకున్నారట. గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని.. అలియా.. రణబీర్ పెళ్లి తర్వాత ఇండస్ట్రీలో జరగబోయే వివాహం వీరిదే అంటూ వార్తలు వినిపించాయి. కానీ అనుకోకుండా..వీరు తమ రిలేషన్‏కు ఎండ్ కార్డ్ వేసేశారు. ఇంతకీ ఆ స్టార్ లవ్ బర్డ్స్ ఎవరంటే.. స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Siddarth Malhotra).. కియారా అద్వానీ (Kiara Advani).. వీరిద్దరి ప్రేమ.. బ్రేకప్ వ్యవహరం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

గత కొద్ది రోజులుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని టాక్ నడిచింది. తరచూ ఇద్దరూ కలుసుకోవడం..మీడియాకు ఎదురుపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తుంచాయి. అయితే ఆకస్మాత్తుగా వీరిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారని బాలీవుడ్ మీడియా వెల్లడించింది. వీరు విడిపోయారని. ఒకరినొకరు కలుసుకోవడం.. మాట్లాడుకోవడం మానేశారని టాక్ నడుస్తోంది. దీనికి తోడు కియారా బ్రేకప్ వార్తలు నిజమే అంటూ వారి సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. సిద్దార్థ్, కియారా తమ రిలేషన్ గురించి ఇప్పటివరకు బహిరంగంగా ప్రస్తావించలేదు.. కానీ వారి సోషల్ మీడియా పోస్టుల ద్వారా వీరు ప్రేమలో ఉన్నట్లు అభిమానులు అనుకున్నారు.

షెర్షా సినిమా చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమకు దారితీసింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరు కలిసి పార్టీలకు వెళ్లడం. వెకేషన్స్ అంటూ తెగ హడావిడి చేశారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అనుహ్యంగా వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ప్రస్తుతం కియారా భూల్ భూలయ్యా 2 సినిమాలో నటిస్తుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా కనిపించనున్నాడు. ఈ మూవీ మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Jeevitha Rajasekhar: తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉంది.. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..

Singer Sunitha: గుడ్ న్యూస్ షేర్ చేసిన సింగర్ సునీత.. Blessed అంటూ..

S Janaki Birthday: ఐదుతరాల హీరోయిన్లకు ఆలంబన జానకమ్మ స్వరం.. గానకోకిల పుట్టిన రోజు నేడు..

Viral Photo: ఇంద్రలోకంలో అలిగినట్లుంది.. భువిపైకి వచ్చింది ఈ సుకుమారి.. ఎవరో గుర్తించారా..?