ఒక్క సినిమాతో కుర్రాళ్లను ఆగం చేసిన చిన్నది.. మతిపోగొట్టేస్తున్న వయ్యారి...
02-11-2026
Pic credit - Instagram
Phani Ch
సౌత్ సినీ ఇండస్ట్రీలో తన చిలిపి నవ్వులు, సహజసిద్ధమైన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న క్యూట్ బ్యూటీ నజ్రియా నజీమ్.
'రాజా రాణి' సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన నజ్రియా, మొదటి సినిమాతోనే ఎక్స్‌ప్రెషన్ క్వీన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన 'అంటే సుందరానికీ!' సినిమా ద్వారా నజ్రియా నేరుగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది.
స్టార్ హీరో ఫహద్ ఫాజిల్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాల్లో కొంత విరామం తీసుకున్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా తాజా అప్‌డేట్స్‌ను పంచుకుంటూ అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది.
నవంబర్ 6 న విడుదల కాబోతున్న 'సీన్' సినిమాతో మన ముందుకు రాబోతున్నారు నజ్రియా నజీమ్. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదల కానున్న ఈ మూవీలో తమిళ స్టార్ హీరో సూర్యతో జతకట్టారు ఈమె.
రస హిట్లతో జోరు మీదున్న హీరో సూర్య నుంచి రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో మాయ అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు నజ్రియా.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో తన డ్రెస్సింగ్ స్టైల్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈమె. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు రెడ్ కలర్ శారీ లో ఫ్యూజన్ లుక్‌తో అదరగొట్టింది.