Viral Photo: ఇంద్రలోకంలో అలిగినట్లుంది.. భువిపైకి వచ్చింది ఈ సుకుమారి.. ఎవరో గుర్తించారా..?

సెలబ్రిటీల చిన్నపాటి ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒక ట్రెండ్‌లా మారాయి. వాటిని ఫ్యాన్స్ నెట్టింట తెగ సర్కులేట్ చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఫోటో వైరల్ అవుతుంది.

Viral Photo: ఇంద్రలోకంలో అలిగినట్లుంది.. భువిపైకి వచ్చింది ఈ సుకుమారి.. ఎవరో గుర్తించారా..?
Heroine Childhood Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 23, 2022 | 11:26 AM

Heroine Childhood Photo: పై ఫొటోలో పాలుగారే బుగ్గులతో కనిపిస్తున్న చిన్నారి.. ఇప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్.. మలయాళ, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో స్ట్రయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఓ డబ్బింగ్ సినిమాతో  తెలుగు ఆడియెన్స్ మదిలో ఎప్పుడో ప్లేస్ సంపాదించుకుంది. ఆమె వెండితెరపై కనిపిస్తే.. ప్రేక్షకులు సమ్మోహనం చెందుతారు. ఆమె నటిస్తే.. ఈ లోకాన్ని మరిచి.. ఆ పాత్రలో లీనమైపోతారు. క్యూట్.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌ను కట్టిపడేసే ఈ బ్యూటీ.. ఎమోషన్ సీన్లతో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇంతకు ఈ ముద్దులొలికే చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మడు ఎవరో కాదు రాజా రాణి సినిమాతో సౌత్‌లో ఒక్కసారిగా పాపులర్ అయిన నజ్రియా నజీమ్. 20 డిసెంబర్ 1994 జన్మించిన నజ్రియా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో చేసింది. ఆపై ఓ టెలివిజన్ వ్యాఖ్యతగా పనిచేసింది. అనంతం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.  మలయాళం లో స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ పలు తమిళ్ సినిమాల్లోనూ నటించింది. తాజాగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘అంటే సుందరానికి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఈ మూవీ జూన్‌ 10న విడుదల కానుంది. నజ్రియా నజీమ్ భర్త ఫహద్ ఫాజిల్(Fahad Fazil) కూడా మంచి డిమాండ్ ఉన్న యాక్టర్. ఈయన కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అందం, టాలెంట్ ఉన్న నజ్రియాకు ఇక తెలుగులో ఆఫర్లు క్యూ కట్టే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!

Also Read: Viral Video: బతికున్న కుందేలును అమాంతం మింగేసిన పక్షి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్