AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jeevitha Rajasekhar: తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉంది.. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..

చెక్ బౌన్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలకు జీవిత రాజశేఖర్(Jeevitha Rajasekhar) క్లారిటీ ఇచ్చారు. నగరి కోర్టులో రెండు నెలలుగా ఈ కేసు నడుస్తోందన్నారు.

Jeevitha Rajasekhar: తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉంది.. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..
Jeevitha Rajasekhar
Rajeev Rayala
| Edited By: |

Updated on: Apr 23, 2022 | 6:09 PM

Share

చెక్ బౌన్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలకు జీవిత రాజశేఖర్(Jeevitha Rajasekhar) క్లారిటీ ఇచ్చారు. నగరి కోర్టులో రెండు నెలలుగా ఈ కేసు నడుస్తోందన్నారు. తనకు సమన్లు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అరెస్ట్ వారెంట్ మాత్రం అందలేదన్నారు. అయినప్పటికీ తమ లాయర్లు కోర్టులో అటెండ్ అయ్యారని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చాక ఎవరు తప్పు చేశారో.. ఎవరిది మోసమో తెలుస్తుందన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదనీ.. ఏదైనా ఫేస్  చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కోర్టు తీర్పు తర్వాత అన్ని వివరాలు చెప్తామన్నారు జీవిత రాజశేఖర్. తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యంతో పాటు.. తప్పు చేయకపోతే నిలదీసే ధైర్యం కూడా ఉందన్నారామె. అప్పట్లో రాజశేఖర్‌ హీరోగా విడుదలైన గరుడ వేగ సినిమా నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఆస్తులు తాకట్టుపెట్టి తమ దగ్గర నుంచి 26 కోట్ల రూపాయలు తీసుకున్నారని జోస్టర్‌ ఫిలిం సభ్యులు చెబుతున్నారు.

తమ దగ్గరికొచ్చి చాలా ఎమోషనల్‌ అయ్యారనీ.. రాజశేఖర్‌ తండ్రి వరదరాజన్‌ చెప్పడంతో.. ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చామనీ తెలిపారు. ఆ తర్వాతే వారి నిజస్వరూపం తెలిసొచ్చిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మోసానికి సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయంటున్నారు జోస్టర్ ఫిలిం సర్వీస్ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు, ఎండీ హేమ. తమ దగ్గర తాకట్టుపెట్టిన ఆస్తులను బినామిల పేరుతో మార్చుకుని, మోసం చేశారని.. దానివల్ల తామెంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు జోస్టర్‌ ఫిలిం సభ్యులు. జీవిత చాలా డేంజరస్ అంటూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. మేం దుర్మార్గులమైతే 35 ఏళ్లు ఇండస్ట్రీలో ఉండేవాళ్లం కాదన్నారు. నేను ఎక్కడికీ పారిపోలేదు. మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. వాటిని కోర్టులో రుజువు చేయాలన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :  

Aamna Sharif: అందాలతో ఫ్యాన్స్ హృదయాలను లాక్ చేస్తున్న ఆమ్నా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

Meenakshi Chaudhary:పింక్ శారీ లో పిచ్చెకిస్తున్న మీనాక్షి.. ఇంత అందానికి ఫిదా కానీ వారుంటారా

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్.. రేపు యూసఫ్ గూడ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో