AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్.. రేపు యూసఫ్ గూడ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య (Acharya). ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ కొరటాల శివ

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్.. రేపు యూసఫ్ గూడ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
Acharya
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2022 | 9:04 PM

Share

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య (Acharya). ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది. అలాగే ఆచార్య సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మెగాస్టార్.. మెగా పవర్ స్టార్ ఇద్దరూ కలిసి నటిస్తోన్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడూ చూస్తామా అని వేయి కళ్లతో ఎదురూచూస్తున్నారు మెగా అభిమానులు. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఈ సందర్బంగా ఏప్రిల్ 23న హైదరాబాద్ యూసఫ్ గూడలో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో రేపు యూసఫ్ గూడ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు యూసఫ్ గూడ ప్రాంతాల్లో రద్ధీ ఉండనుందని పోలీసులు అంచనా వేశారు. దీంతో ఆయా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

ట్రాఫిక్ మళ్లింపులు ఇలా… రేపు మధ్యాహ్నం 5 గంటల నుంచి రాత్రి 11 గంటలకు ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు దారి మళ్లింపు చేశారు.

* మైత్రీవనం నుండి వచ్చే వాహనములు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు అనుమతించబడవు. సవేరా ఫంక్షన్ హాల్ వద్ద కృష్ణకాంత్ పార్క్ – కళ్యాణ్ నగర్ వైపు మరియు సత్య సాయి నిగమాగమం – కమలాపురి కాలనీ – కృష్ణ నగర్ – జూబ్లీహిల్స్ వైపు ట్రాఫిక్ మళ్లించబడుతాయి. * జూబ్లీహిల్స్ నుండి వచ్చే వాహనములు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు అనుమతించబడవు. శ్రీ నగర్ కాలనీ వద్ద – సత్యసాయి నిగమాగమం వైపు వాహనములు మళ్లించబడుతుంది.

పార్కింగ్ ప్రదేశాలు.. 1. మహమూద్ ఫంక్షన్ ప్యాలెస్ కేవలం కార్ పార్కింగ్ కోసం మాత్రమే ఈ స్థలాన్ని కేటాయించారు. దాదాపు 70 కార్లు పార్కింగ్ చేయవచ్చు. 2. సవేరా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఓపెన్ గ్రౌండ్ లో 4 వీలర్, 2 వీలర్ వాహనాలను పార్కింగ్ చేయ్యెచ్చు. దాదాపు 200 కార్లు, 700 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయవచ్చు. 3. యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో 2 వీలర్స్ మాత్రమే పార్కింగ్ చేయాలి. దాదాపు 200 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయ్యోచ్చు. 4. యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ లో 2 వీలర్ పార్కింగ్ చేయ్యోచ్చు. దాదాపు 500 ద్విచక్ర వాహనాలు పార్కింగ్.

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే వ్యక్తులందరూ తప్పనిసరిగా నిర్వాహకులు జారీ చేసిన పాస్‌లను కలిగి ఉండాలని….అలాంటి పాస్‌లలో హోలోగ్రాం (HOLOGRAM), సీరియల్ నంబర్ కలిగి ఉండాలని. పాస్‌లు లేని ఆహ్వానితులు బెటాలియన్ గ్రౌండ్లోకి ప్రవేశించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పాసులు లేనివారు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు ఎదుర్కోవద్దని కోరారు. ఇక వాహనదారులు.. ట్రాఫిక్ ఆంక్షలు పాటిస్తూ. ప్రత్యామ్నాయ మార్గాలలను తీసుకోవాలని కోరారు.

Also Read: Samantha: నా మౌనాన్ని బలహీనత అనుకోవద్దు.. వైరలవుతున్న సమంత లేటేస్ట్ ట్వీట్..

Allu Arjun: పుష్పరాజ్ పై పొగడ్తలు కురిపించిన కేజీఎఫ్ 2 బ్యూటీ.. నేను మీ వీరాభీమానినంటూ..

Jersey Movie: జెర్సీ సినిమాపై ప్రశంసలు కురిపించిన న్యాచురల్ స్టార్.. మీ మంచి మనసే కారణమంటూ స్టార్ హీరో రిప్లై..

Health Tips: వేసవిలో వీటిని రాత్రంతా నానబెట్టి తింటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.. అవెంటో తెలుసా..