TSTET: టీఎస్ టెట్ అప్లికేషన్‌లో తప్పులు.. అభ్యర్థుల టెన్షన్.. సవరణకు అవకాశం ఇచ్చేనా?..
TS TET: తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్‌కు విశేష స్పందన వచ్చింది. లక్షలాది మంది అభ్యర్థులు టెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
TS TET: తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్‌కు విశేష స్పందన వచ్చింది. లక్షలాది మంది అభ్యర్థులు టెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 12న పరీక్ష నిర్వహించనుండగా.. ఎగ్జామ్‌కు కొద్దిరోజుల ముందు దీనికి సంబంధించిన హాల్ టికెట్‌ను విడుదల చేయనున్నారు. అయితే, ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులు.. టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ 2022లో పేపర్ 1, పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తుండగా.. రెండింటికీ అప్లికేషన్స్ భారీగా వచ్చాయని అధికారులు ప్రకటించారు.
ఇదిలాఉంటే, టెట్ అప్లికేషన్ సందర్భంగా చాలా మంది అభ్యర్థులు పొరపాటు చేసినట్లు తెలుస్తోంది. ఫోటో అప్‌లోడ్ సందర్భంలో, అప్లికేషన్ నింపే సమయంలో స్పెల్లింగ్ మిస్టేక్స్, గతంలో రాసిన టెట్ వివరాలు నింపడంలో పొరపాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది అభ్యర్థులు టెట్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఉంటుందా? ఉండదా? అనే సందిగ్ధంలో పడిపోయారు. తాము తెలియక చేసిన పొరపాటు కారణంగా నష్టపోవాల్సి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి.. టెట్ ఎడిట్ ఆప్షన్ ఇస్తే బాగుటుందని అభ్యర్థులు కోరుకుంటున్నారు. మరి విద్యాశాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
ఇదిలాఉండగా.. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నోటిఫికేషన్ విడుదలవడం, అప్లికేషన్ ప్రక్రియ కూడా ముగియడం తెలిసిన విషయమే. మార్చి 26 నుంచి ఏప్రిల్12వ తేదీ వరకు అప్లికేషన్ ప్రక్రియ సాగింది. జూన్ 12వ తేదీన టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక టెట్ కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం టీసాట్ ఛానెల్ ద్వారా ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తున్నారు.
Also read:
EV Battery Safe Tips: ఈ టిప్స్ పాటించండి.. మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని సురక్షితంగా ఉంచుకోండి..!
Andhra Pradesh: 20 రోజులవుతోంది.. ఆ ఫైర్ బ్రాండ్ ఎక్కడ?.. గుడివాడలో జోరుగా సాగుతున్న చర్చ..!