Number Plate: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ.. ఆ ఒక్క నెంబర్ కోసం రూ. 70 కోట్లు పెట్టాడు..
Number Plate auction: కొంతమంది ఖరీదైన వాహనాలు కొని.. ఇష్టమైన నెంబర్ల కోసం అంతే డబ్బులను వెచ్చిస్తుంటారు. అలాంటి ఘటనే దుబాయ్‌లో చోటుచేసుకుంది. ఇష్టమైన ఫ్యాన్సీ నెంబర్ కోసం
Number Plate auction: కొంతమంది ఖరీదైన వాహనాలు కొని.. ఇష్టమైన నెంబర్ల కోసం అంతే డబ్బులను వెచ్చిస్తుంటారు. అలాంటి ఘటనే దుబాయ్‌లో చోటుచేసుకుంది. ఇష్టమైన ఫ్యాన్సీ నెంబర్ కోసం ఓ వ్యక్తి రూ.70 కోట్లు పెట్టాడు. ఇది విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా దుబాయ్‌లో నెంబర్ ప్లేట్ల వేలం జరిగింది. దీనిలో కార్లకు ఇతర వాహననాలకు నెంబర్ ప్లేట్ల వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఫ్యాన్సీ మొబైల్ ఫోన్ నెంబర్లపై కూడా ప్రత్యేక బిడ్ నిర్వహించారు. ఈ వేలంలో AA8 నెంబర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మూడవ నెంబర్ ప్లేట్‌గా రికార్డు క్రియేట్ చేసింది. దుబాయ్ ‘మోస్ట్ నోబుల్ నంబర్స్’ ఛారిటీ వేలంలో మొబైల్ ఫోన్ నంబర్‌లపై నిర్వహించిన బిడ్‌లో AA8 సింగిల్ డిజిట్ నెంబర్ 35 మిలియన్ల దిర్హమ్‌లకు అమ్ముడుపోయింది. మన కరెన్సీలో దాని విలువ రూ.70 కోట్లు ఉంటుంది. గతేడాది AA9 నెంబర్ ప్లేట్‌ను రూ.79 కోట్లకు ఓ వ్యక్తి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి వన్ బిలియన్ మీల్స్ సంస్థ కోసం నిర్వహించిన వేలంలో 53 బిలియన్ల దిర్హమ్‌లను ఆర్జించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ డబ్బుతో 50 దేశాల్లో నిరుపేదలకు ఆహారం అందిచనున్నట్లు తెలిపారు.
కాగా.. ఈ వేలంను దుబాయ్‌లోని ఎమిరేట్స్ ఆక్షన్ అండ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) నిర్వహించింది. తాజా వేలంలో డబుల్ డిజిట్ దుబాయ్ కారు ‘F55’నెంబర్ ప్లేట్ రూ.8.23 కోట్లకు అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు మరో కార్ ప్లేట్ V66 కూడా రూ.7.91 కోట్లకు దక్కించుకున్నారు పోటీదారులు.
ఇదిలాఉంటే.. భారత్‌లో కూడా నెంబర్ ప్లేట్ల కోసం కొంతమంది రూ.లక్షలు చెల్లిస్తున్నారు. ఇటీవల చండీఘడ్‌లో ఓ హోండా యాక్టివ్ ఓనర్ వీఐపీ 0001 నెంబర్ ప్లేట్ కోసం రూ.15 లక్షల వరకు కస్టమర్ చెల్పలించాడు. బ్రిజ్ మోహన్ అనే యాడ్స్ ఏజెన్సీకి చెందిన వ్యక్తి ఈ నెంబర్ ప్లేట్‌ను దక్కించుకున్నాడు.
Also Read: