ఆయోధ్య రామ మందిర నిర్మాణాకి కదిలిన పాతబస్తీ.. విరాళాలు సేకరించిన ముస్లిం మహిళలు

హైదరాబాద్‌లోని పాతబస్తీలో ముస్లిం మహిళలు.. శ్రీరాముడి మందిర నిర్మాణానికి మేము సైతం అంటూ ముందుకు వచ్చారు.

  • Balaraju Goud
  • Publish Date - 6:01 pm, Sun, 24 January 21
ఆయోధ్య రామ మందిర నిర్మాణాకి కదిలిన పాతబస్తీ.. విరాళాలు సేకరించిన ముస్లిం మహిళలు

Minority cell rally for Ram Mandir funds : అయోధ్యలోని రామాలయ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ కొనసాగుతోంది. ఇటు హైదరాబాద్‌లోని పాతబస్తీలో ముస్లిం మహిళలు.. శ్రీరాముడి మందిర నిర్మాణానికి మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర విరాళాల సేకరణ పేరుతో భారీగా ర్యాలీ నిర్వహించారు. పాతబస్తీలోని విధిల, డబీర్‌పురా ప్రాంతాలు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోయాయి. పాతబస్తీలోని డబీర్‌పురా దారుషిఫా దగ్గర మైనారిటీ మహిళలు ర్యాలీలో పాల్గొని శ్రీ రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ మహిళా నేతలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా సౌత్ జోన్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు..

ఈనెల 20 నుంచి తెలుగు రా ష్ట్రాల్లో అయోధ్య ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ కొనసాగుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో విరాళాల సేకరణకు మంచి స్పందన లభిస్తోంది. అయోధ్య ఆలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరించడం సంతోషంగా ఉందంటున్నారు ముస్లిం మహిళలు. 400 ఏళ్ల తర్వాత చారిత్రక తీర్పు వచ్చిందని, ఇప్పుడు రాముడు మళ్లీ ఆయన స్థానంలోకి వస్తున్నారని ముస్లిం మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండు లక్షల మంది నిధి సమర్పణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని.. అంచనాలకు మించి విరాళాలు వసూళ్లు అవుతున్నాయి.

Read Also…  మరోసారి దేశ ప్రజల మనసును దోచిన ఇండియన్ ఆర్మీ.. మంచుకొండల్లో బాలింతను మోసుకెళ్లిన జవాన్లు