Road Accident: గుజరాత్ రాష్ట్రంలో సూరత్ వద్ద రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ఇద్దరు మృతి..
Road Accident: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన..
Road Accident: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అధికారిక సమాచారం ప్రకారం.. నగరంలోని అడిక్‌మెంట్ ఆంజనేయస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్, పాన్ బజార్ వేణుగోపాల స్వామి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రమణ, మరో ఆలయ ఈవో సత్యనారాయణ, పూజారి వెంకటేశ్వర శర్మ, క్లర్క్ కేశవరెడ్డి సూరత్‌కు వెళ్లారు. అయితే ఇవాళ అక్కడ జరిగిన ప్రమాదంలో శ్రీనివాస్, రమణ మృత్యువాత పడ్డారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అహ్మదాబాద్ పట్టణంలోని హోప్ హాస్పిటల్‌కు తరలించారు.
అయితే ప్రమాదంపై సమాచారం అందుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read:
Rakul Preet Singh: రకుల్ కరోనాను ఎలా జయించిందో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ వీడియో చూడండి..