AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలు గెట్‌ రడీ.. నేటి నుంచే నుమాయిష్‌, ఎంట్రీ ఫీజు ఎంతో తెలుసా.?

హైదరాబాదీలకు న్యూఇయర్‌ గిఫ్ట్‌... ఏటా ఎంతో గ్రాండ్‌గా నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) ఈ ఏడాది కూడా ప్రారంభమవుతోంది. జనవరి 1వ తేదీ (ఆదివారం) నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో 83వ నుమాయిష్‌ ప్రారంభకానున్నట్లు.. ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షులు అశ్విని మార్గం తెలిపారు. గత రెండేళ్లుగా కోరనా కారణంగా నుమాయిష్‌లో వ్యాపారాలు సరిగా..

Hyderabad: హైదరాబాదీలు గెట్‌ రడీ.. నేటి నుంచే నుమాయిష్‌, ఎంట్రీ ఫీజు ఎంతో తెలుసా.?
Hyderabad Numaish
Narender Vaitla
|

Updated on: Jan 01, 2023 | 7:30 AM

Share

హైదరాబాదీలకు న్యూఇయర్‌ గిఫ్ట్‌… ఏటా ఎంతో గ్రాండ్‌గా నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) ఈ ఏడాది కూడా ప్రారంభమవుతోంది. జనవరి 1వ తేదీ (ఆదివారం) నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో 83వ నుమాయిష్‌ ప్రారంభకానున్నట్లు.. ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షులు అశ్విని మార్గం తెలిపారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా నుమాయిష్‌లో వ్యాపారాలు సరిగా సాగలేవు అయితే ఈసారి ఎలాంటి అవంతరాలు లేకుండా నుమాయిష్‌ జరుగుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నుమాయిష్‌ ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం నుంచి నుమాయిష్‌ ప్రారంభం కానుంది.

ఈ ఏడాది కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్నిరకాల ఉత్పత్తులతో కూడిన స్టాల్స్‌ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సుమారు 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్‌ ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు ఉచిత పార్కింగ్, వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు కోవిడ్‌ భద్రతా ఏర్పాట్లను నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక ఎంట్రీ ఫీజు విషయానికొస్తే పెద్దలకు రూ. 40గా నిర్ణయించారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు ఎంట్రీ ఫీజును మినహాయించారు.

నుమాయిష్‌ను హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డిలు ప్రారంభించనున్నారు. పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేకగా అమ్యూజ్‌మెంట్‌ పార్కును సిద్ధం చేశారు. ఈ ఏడాది నుమాయిష్‌కు జనాలు భారీగా వచ్చే అవకాశం ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఎగ్జిబిషన్‌ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..