Electric Car: ఒక్క సారి చార్జ్ చేస్తే 420 కిలో మీటర్లు.. 7.5 సెకండ్స్ లోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే కార్..
ఇది కేవలం 7.5 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదని ఆ కంపెనీ ప్రకటించింది. ఇది ప్రస్తుతం చైనా మర్కెట్లోనే అందుబాటులో ఉంది. మన దేశంలో లాంచింగ్ గురించి ఆ కంపెనీ నుంచి ఎటువంటి ప్రకటనా లేదు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చైనా దూసుకుపోతోంది. ఇప్పటికే పలు కంపెనీలు, వివిధ రకాల వేరియంట్లలో తమ అత్యాధునిక మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. ఇదే క్రమంలో మరో చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD తన కొత్త ఎలక్ట్రిక్ కారు BYD 2023 డాల్ఫిన్ ను అక్కడి స్థానిక మార్కెట్లోకి విడుదల చేసింది. మెరైన్ ఈస్తటిక్స్ డిజైన్ తో వస్తున్న ఈకారులో ఎల్ఎఫ్పీ బ్లేడ్ బ్యాటరీని వినియోగించారు. ఇది కేవలం 7.5 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదని ఆ కంపెనీ ప్రకటించింది. ఇది ప్రస్తుతం చైనా మర్కెట్లోనే అందుబాటులో ఉంది. మన దేశంలో లాంచింగ్ గురించి ఆ కంపెనీ నుంచి ఎటువంటి ప్రకటనా లేదు. అయితే వచ్చే కొత్త సంవత్సరంలోనే దీనిని ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చైనాలో దీని ప్రారంభ ధర CNY 1,16,800(దాదాపు రూ. 13.9లక్షలు)గా నిర్ణయించారు. అలాగే టాప్ వేరియంట్ ధర CNY 1,36,800(సుమారు 16.3 లక్షలు)గా ఉంది.
స్పెసిఫికేషన్లు..
BYD 2023 డాల్ఫిన్ ఈ-కార్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ తో వస్తోంది. రెండు రకాల సామర్థ్యాలు 70 Kw/18Nm, 130 Kw/290 Nm కలిగిన మోటార్లు అందుబాటులో ఉన్నాయి. 70 Kw/18Nm వేరియంట్ 420 కిలోమీటర్ల మైలైజీ ఇస్తుంది. ఇది 10.9 సెకన్లలో 1 నుంచి 100 kmph అందుకుంటుంది. అలాగే 130 Kw/290 Nm మోటార్ కలిగిన కారు 401 కిలోమీటర్లు రేంజ్ ఉంటుంది. ఇది కేవలం 7.5 సెకన్లలో 0 నుంచి 100 kmph అందుకుంటుంది. దీనిలోని బ్యాటరీ 44.9 kwh సామర్థ్యం కలిగిన బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. బ్యాటరీ చార్జింగ్ కి 60 kw ఫాస్ట్ చార్జింగ్ అందుబాటులో ఉంటుంది.
ఫీచర్లు ఇవే..
BYD 2023 డాల్ఫిన్ ఈ-కార్ ఇంటీరియర్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. సొగలైన మెరైన్ ఈస్తటిక్స్ డిజైన్ తో రూపొందించారు. ఫ్లాట్ బాటమ్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 5 అంగుళాల ఎల్సీడీ ప్యానెల్, 12.8 అంగుళాల ఫ్లోటింగ్ సెంట్రల్ కంట్రోల్ స్క్రీన్ ఉంటుంది. సీటింగ్ కూడా అనువైన విధంగా, అత్యంత ఆకర్షణీయంగా ఉండనుంది. దీని వీల్ బేస్ 2700ఎంఎం ఉంటుంది. ఇది పింక్, బేబీ గ్రే, ఎల్లో, సర్ఫింగ్ బ్లూ, అట్లాంటిస్ గ్రే, టారో పర్పుల్, బ్లాక్ రంగుల ఆప్షన్లలో వినియోగదారులను ఆకర్షిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..