Volkswagen EV: వోక్స్ వ్యాగన్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్లు మాత్రం టాప్ సీక్రెట్! మార్కెట్ లోకి ఎప్పటి నుంచి అంటే..
జర్మనీకి చెందిన ఆటోమోబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ కూడా ఓ అప్ డేట్ ఇచ్చింది. తన కొత్త ఎస్ యూవీ మోడల్ ఎలక్ట్రిక్ కార్ ను యూఎస్ లో జనవరి మూడో తేదీన జరిగే కస్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్) లో ప్రదర్శించననున్నట్లు వెల్లడించింది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీలో కంపెనీల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. కొత్త సంవత్సరంలో దిగ్గజ కంపెనీలకు చెందిన మోడళ్లు మార్కెట్ కు క్యూ కట్టే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రకటించాయి. అత్యధిక మైలేజీ, టాప్ స్పీడ్, లగ్జరీ, అత్యాధునిక ఫీచర్లతో కార్లను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నాయి. ఒక్కో బ్రాండ్ ఒక్కో రకమైన ప్రత్యేక ఫీచర్లతో వినియోగదారులకు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జర్మనీకి చెందిన ఆటోమోబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ కూడా ఓ అప్ డేట్ ఇచ్చింది. తన కొత్త ఎస్ యూవీ మోడల్ ఎలక్ట్రిక్ కార్ ను యూఎస్ లో జనవరి మూడో తేదీన జరిగే కస్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్) లో ప్రదర్శించననున్నట్లు వెల్లడించింది. అయితే ఈ కారుకు సంబంధించిన ఎటువంటి ఫీచర్లను ఆ కంపెనీ ప్రకటించలేదు.
ఊహాగానాలు మాత్రం బోలేడు..
వోక్స్ వ్యాగన్ ఎస్ యూవీ వేరియంట్ లో ఎలక్ట్రిక్ కార్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించగానే అందరూ ఆ కారు ఫీచర్ల కోసం వెతికారు. అయితే కంపెనీ దానిని ఎక్కడ ప్రస్తావించకుండా దాచి ఉంచింది. ఈ నేపథ్యంలో మార్కెట్ వర్గాలు పలు విధాలుగా కారు మోడల్, ఫీచర్లపై ఊహగానాలు వినిపిస్తున్నారు.
ఇప్పటికే రెండు మోడళ్లపై ప్రకటన..
అయితే వోక్స్ వ్యాగన్ ఇది వరకే తన ఎలక్ట్రిక్ వేరియంట్ సెడాన్ ను ID.Aero పేరుతోనూ.. అలాగే లార్జ్ ఎస్ యూవీ మోడల్ ను ID.8 పేరుతో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 2022 జూన్ లో ID.Aero కు సంబంధించిన కాన్సెప్ట్, చిత్రాలను కూడా విడుదల చేసింది. వోక్స్ వ్యాగన్ ID.8 కారును 2021లోనే ప్రకటించినా.. ఇప్పటి వరకూ దానికి సంబంధించిన వివరాలు ఏవీ వెల్లడించలేదు. అలాగే ఇప్పుడు కొత్తగా ప్రకటించిన ఎస్ యూవీ కారుకు సంబంధించిన వివరాలు కూడా ఆ కంపెనీ గోప్యంగానే ఉంచింది. అయితే ఈ ఎస్ యూవీ వేరియంట్ కారు ID.Aero సెడాన్ కు దగ్గరలోనే ఉంటుందని, దాని పేరు కూడా ID.7 అని ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో మూడు రోజుల్లో ప్రారంభం అయ్యే సీఈఎస్ 2023 లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రదర్శనలో కారును ఆవిష్కరిస్తామని ఇప్పటికే వోక్స్ వ్యాగన్ ప్రకటించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..